Nani Movie | నాని, శ్రీకాంత్‌ ఓదెల మూవీలో హీరోయిన్‌ ఎవరు..? కుదిరితే జాన్వీ.. లేదంటే శ్రద్ధాకపూర్‌..!

Nani Movie | న్యాచురల్‌ స్టార్‌ నాని, డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కనున్నది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘దసరా’ మూవీ బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ రూ.100కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం సైమా, ఐఫా అవార్డులను సైతం కొల్లగొట్టింది. ఈ క్రమంలోనే నాని, శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో మరో సినిమాను తెరకెక్కించబోతున్నారు.

Nani Movie | నాని, శ్రీకాంత్‌ ఓదెల మూవీలో హీరోయిన్‌ ఎవరు..? కుదిరితే జాన్వీ.. లేదంటే శ్రద్ధాకపూర్‌..!

Nani Movie | న్యాచురల్‌ స్టార్‌ నాని, డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కనున్నది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘దసరా’ మూవీ బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ రూ.100కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం సైమా, ఐఫా అవార్డులను సైతం కొల్లగొట్టింది. ఈ క్రమంలోనే నాని, శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో మరో సినిమాను తెరకెక్కించబోతున్నారు. దసరా పండుగ సందర్భంగా ‘నాని ఓదెల 2’ వర్కింగ్‌ టైటిల్‌తో సినిమా మొదలైంది. సికింద్రాబాద్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే ఓ పీరియాడికల్‌ స్టోరీని శ్రీకాంత్‌ సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మూవీలో హీరోయిన్‌ కోసం మేకర్స్‌ వెతుకున్నారు. వాస్తవానికి గతంలో జాన్వీ కపూర్‌ని హీరోయిన్‌గా తీసుకున్నారని ప్రచారం జరిగింది.

జాన్వీ కపూర్‌ రెమ్యునరేషన్‌ విని మేకర్స్‌ వెనక్కి తగ్గారని వార్తలు వచ్చాయి. తాజాగా మరో బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ని తీసుకోవాలని భావిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో మూవీని తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ఆ రేంజ్‌లో ఉండే హీరోయిన్‌ అయితేనే బాగుంటుందని దర్శక నిర్మాతలు అనుకుంటున్నారని తెలుస్తున్నంది. అయితే, శ్రద్ధాకపూర్‌ని ఫైనల్‌ చేశారా? లేదా? అన్నదానిపై స్పష్టత రాలేదు. కుదురితే జాన్వీ కపూర్‌ని లేకపోతే.. శ్రద్ధాకపూర్‌ని తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారని టాక్‌. జాన్వీ కపూర్‌ ‘దేవర’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

అలాగే, రామ్‌చరణ్‌, బుచ్చిబాబు కాంబోలో రానున్న చిత్రంలోనూ నటించనున్నది. ఇప్పటికే షూటింగ్‌ పూజ కార్యక్రమాలతో మొదలైంది. ఇక శ్రద్ధా కపూర్‌ ‘సాహో’ మూవీలో ప్రభాస్‌ సరసన నటించింది. శ్రద్ధాకపూర్‌ ‘స్త్రీ-2’ మూవీ నటించింది. ఈ మూవీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. దాదాపు రూ.600కోట్ల వరకు వసూళ్లను సాధించింది. నాని, శ్రీకాంత్‌ ఓదెల మూవీలో జాన్వీ, శ్రద్ధాకపూర్‌లలో ఎవరిని ఫైనల్‌ చేస్తారన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీ మ్యూజిక్‌ బాధ్యతలను మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్‌కి అప్పగించనున్నట్లు తెలుస్తున్నది. త్వరలోనే అనౌన్స్‌మెంట్‌ రానుందని టాక్‌. ఇక మూవీని సుధాకర్‌ చెరుకూరి నిర్మించనున్నారు.