వ్యభిచారం గృహం పై దాడి .. యువతులు అరెస్ట్

విధాత : గుట్టుచప్పుడు కాకుండా హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న అయిదుగురిని సోమవారం రాత్రి ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు ఆరెస్టు చేవారు. ఎల్‌బీనగర్‌ నుంచి సరూర్‌నగర్‌ పాత రోడ్డులోని హోటల్‌ ఏబీ7 రెసిడెన్సీలో కొన్నాళ్ల నుంచి కూకట్‌పల్లికి చెందిన ముత్తవరపు శివ, సలీం ఇద్దరు గుట్టుచప్పడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. బాలాపూర్‌ గుర్రంగూడలో ఉండే కొమ్మోల్ల ప్రశాంత్‌ వారి కింది సబ్‌ ఆర్గనైజర్‌గా పని చేస్తున్నాడు.సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు సోమవారం రాత్రి హోటల్‌పై దాడి చేసి నలుగురు […]

వ్యభిచారం గృహం పై దాడి .. యువతులు అరెస్ట్

విధాత : గుట్టుచప్పుడు కాకుండా హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న అయిదుగురిని సోమవారం రాత్రి ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు ఆరెస్టు చేవారు. ఎల్‌బీనగర్‌ నుంచి సరూర్‌నగర్‌ పాత రోడ్డులోని హోటల్‌ ఏబీ7 రెసిడెన్సీలో కొన్నాళ్ల నుంచి కూకట్‌పల్లికి చెందిన ముత్తవరపు శివ, సలీం ఇద్దరు గుట్టుచప్పడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. బాలాపూర్‌ గుర్రంగూడలో ఉండే కొమ్మోల్ల ప్రశాంత్‌ వారి కింది సబ్‌ ఆర్గనైజర్‌గా పని చేస్తున్నాడు.
సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు సోమవారం రాత్రి హోటల్‌పై దాడి చేసి నలుగురు యువతులను, సబ్‌ ఆర్గనైజర్‌ ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకుని ఎల్‌బీనగర్‌ పోలీసులకు అప్పగించారు. ప్రధాన నిర్వాహకులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి సెల్‌ఫోన్లు స్వాదీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.