విధాత(హైదరాబాద్): నగర శివారు దుండిగల్ ముత్తూట్ ఫైనాన్స్‌లో దుండగులు చోరీకి యత్నించారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండిగల్ పరిధి గండిమైసమ్మలో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ గోడకు కన్నం వేసిన గుర్తుతెలియని వ్యక్తులు.. అందులోకి ప్రవేశించారు.
దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తుండగా అలారం మోగడంతో దొంగల ముఠా అక్కడి నుంచి పరారయ్యింది. గురువారం విధులకు వచ్చిన సిబ్బంది విషయాన్ని గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. చోరీ యత్నం జరిగిన ప్రాంతాన్ని ఏసీపీ రామలింగరాజు పరిశీలించారు