బోథ్ ఎమ్మెల్యే బాపురావుపై చీటింగ్ కేసు

ఆదిలాబాద్‌ జిల్లా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుపై చీటింగ్ కేసు నమోదైంది. భూ వివాదంలో జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆదేశాలతో ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు

బోథ్ ఎమ్మెల్యే బాపురావుపై చీటింగ్ కేసు

విధాత : ఆదిలాబాద్‌ జిల్లా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుపై చీటింగ్ కేసు నమోదైంది. భూ వివాదంలో జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆదేశాలతో ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. 2012లో రెండు ఇళ్ల స్థలాలను రెండు సార్లు అమ్మి తనను మోసం చేశారంటూ బాధితుడు కోర్టును ఆశ్రయించాడు.

ఈ వివాదంలో కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే బాపురావుతో పాటు సుదర్శన్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బోథ్ సిటింగ్ బీఆరెస్ ఎమ్మెల్యేగా ఉన్న బాపురావు తనకు టికెట్ నిరాకరించడంతో మంగళవారం పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ పరిణామం వెంటనే బాపురావుపై చీటింగ్ కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది.