జ్యోతిష్యం పేరుతో మోసం.. కుమ్మక్కైన ఎస్సై
దాడికి పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోవాలి-ప్రభుత్వానికి బాధిత దంపతులు విజ్ఞప్తి విధాత,Hyderabad: జ్యోతిష్యం పేరుతో ప్రజల వద్ద నుంచి అన్యాయంగా డబ్బులు దండుకుంటూ మోసలకు పాల్పడుతూ వద్దన్నందుకు నాగోల్ బండ్లగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న తమ ఇంటికి అర్థ రాత్రి వచ్చి తనను తన భర్తను, విచక్షణ రహితంగా కొట్టి తాళి తెంపి దాడికి పాల్పడ్డ వాదిరాజ్ జోషి, సంజయ్ జోషి లను కఠినంగా శిక్షించాలని బాధిత దంపతులు పవన్ జోషి, విజయలక్ష్మి ప్రభుత్వానికి విజ్ఞప్తి […]

దాడికి పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోవాలి
-ప్రభుత్వానికి బాధిత దంపతులు విజ్ఞప్తి
విధాత,Hyderabad: జ్యోతిష్యం పేరుతో ప్రజల వద్ద నుంచి అన్యాయంగా డబ్బులు దండుకుంటూ మోసలకు పాల్పడుతూ వద్దన్నందుకు నాగోల్ బండ్లగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న తమ ఇంటికి అర్థ రాత్రి వచ్చి తనను తన భర్తను, విచక్షణ రహితంగా కొట్టి తాళి తెంపి దాడికి పాల్పడ్డ వాదిరాజ్ జోషి, సంజయ్ జోషి లను కఠినంగా శిక్షించాలని బాధిత దంపతులు పవన్ జోషి, విజయలక్ష్మి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం హైదర్గూడా ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ విషయమై గత నెల 24వ తేదీన హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఎస్సై తోటాకుల రాజేష్ కుమ్మక్కై నిందితులపై ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆరోపించారు. వాదిరాజ్ జోషి నుంచి ప్రాణహాని ఉందని తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశామని తెలిపారు.