నాటు సారాయి తయారీ కేంద్రాలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు

గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో నాటు సారాయి తయారీ కేంద్రాలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నాటు పడవలపై ప్రయాణం చేసి దాడులు నిర్వహించారు. విధాత:పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి కె నారాయణ్ నాయక్ ఐపీఎస్ యొక్క ఆదేశాలపై పశ్చిమగోదావరి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పి సి జయ రామరాజు రాబడి నా సమాచారము పై అదనపు ఎస్పీ,ఎన్ఫోర్స్మెంట్ సూపర్డెంట్ డి అరుణ కుమారి గారు, కొవ్వూరు డిఎస్పీ బి శ్రీనాథ్ అద్వర్యము లో కొవ్వూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ […]

  • Publish Date - July 11, 2021 / 12:54 PM IST

గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో నాటు సారాయి తయారీ కేంద్రాలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నాటు పడవలపై ప్రయాణం చేసి దాడులు నిర్వహించారు.

విధాత:పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి కె నారాయణ్ నాయక్ ఐపీఎస్ యొక్క ఆదేశాలపై పశ్చిమగోదావరి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పి సి జయ రామరాజు రాబడి నా సమాచారము పై అదనపు ఎస్పీ,ఎన్ఫోర్స్మెంట్ సూపర్డెంట్ డి అరుణ కుమారి గారు, కొవ్వూరు డిఎస్పీ బి శ్రీనాథ్ అద్వర్యము లో కొవ్వూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పరిధిలో పోలీసు మరియు ఎస్.ఈ.బి సమన్వయము తో ఈ రోజు అనగా 09.07.2021 వ తేది నాడు గోదావరి నదీ పరివాహక ప్రాంతమైన గోంగూర లంక, ముద్దురులంక గ్రామాలలో అధికారులు నాటు పడవలో ప్రయాణం చేసి దాడులు నిర్వహించి 5 వెలుగుతున్న బట్టీలను, 11,200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి, 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని ముగ్గురు ముద్దాయిలను అదుపులోనికి తీసుకుని సదరు ముద్దాయిలు పై కేసు నమోదు చేసినట్లు గాను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ తెలియజేసినారు

ఈ సందర్భంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా ప్రజలు మద్యం నాటుసారా డబ్బు పంపకాల విషయాలను గురించి సమాచారాన్ని కంట్రోల్ రూమ్ తెలియజేసిన ఎడల వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతామని అదనపు ఎస్పి తెలియజేసినారు.

ఈ దాడులలో అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపర్డెంట్ జి అమర్ బాబు ఏలూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డివిజనల్ టాస్క్ ఫోర్స్ సి. ఐ, జి ఎస్ కె. ధనరాజు కొవ్వూరు సత్యనారాయణ మరియు సిబ్బంది పాల్గొన్నారు.