కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో శనివారం చోటుచేసుకున్న బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య 50 దాటింది. మరో 100 మంది గాయాలతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని ఆఫ్థనిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది.
శనివారం సాయంత్రం కాబూల్‌లోని ఓ బాలికల పాఠశాల సమీపంలో ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారు. అయితే ఈ పేలుళ్లకు బాధ్యులెవరన్నది ఇంకా తెలియరాలేదు. తమకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని తాలిబన్‌లు ప్రకటించారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైనిక బలగాలన్నింటినీ ఉపసంహరించుకుంటున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన తర్వాత ఈ దాడి జరుగడం చర్చనీయాంశమైంది.