కడప జిల్లాలో భారీ పేలుడు.. తొమ్మిది మంది దుర్మరణం

విధాత (అమరావతి): కడప జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురాళ్ల గనిలో పేలుడు సంభవించి తొమ్మిది మంది మరణించారు. కడప జిల్లా కలసపాడు మండలంలోని మామిళ్లపల్లె శివారులో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు సుమారు తొమ్మిది మంది కూలీలు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారని సమాచారం. ముగ్గు రాయిని తొలగించేందుకు పేలుడు పదార్థాలు వినియోగించగా.. ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దుర్ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. సుమారు పది మందికిపైగానే గాయపడ్డట్లు […]

  • Publish Date - May 8, 2021 / 07:05 AM IST

విధాత (అమరావతి): కడప జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురాళ్ల గనిలో పేలుడు సంభవించి తొమ్మిది మంది మరణించారు. కడప జిల్లా కలసపాడు మండలంలోని మామిళ్లపల్లె శివారులో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.

పేలుడు సుమారు తొమ్మిది మంది కూలీలు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారని సమాచారం. ముగ్గు రాయిని తొలగించేందుకు పేలుడు పదార్థాలు వినియోగించగా.. ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దుర్ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

సుమారు పది మందికిపైగానే గాయపడ్డట్లు సమాచారం. పేలుడు కోసం జిలిటెన్‌స్టిక్స్‌ అమర్చుతున్న క్రమంలోనే పేలుడు జరిగినట్లు తెలుస్తోంది.