పోలీస్ కస్టడీకి పుర్కాయస్థ
న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్‌పుర్కయస్థ, సంస్థ హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ అధిపతి అమిత్ చక్రవర్తిని నవంబర్ 2 వరకూ పోలీస్ కస్టడీకి పంపుతూ ఢిల్లీలోని ఒక న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది

- హెచ్ఆర్ విభాగం అధిపతి కూడా
- న్యాయస్థానం ఆదేశాలు
న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్‌పుర్కయస్థ, సంస్థ హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ అధిపతి అమిత్ చక్రవర్తిని నవంబర్ 2 వరకూ పోలీస్ కస్టడీకి పంపుతూ ఢిల్లీలోని ఒక న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. తమ వెబ్‌సైట్‌లో చైనా అనుకూల ప్రచారం చేసేందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపై వీరిద్దరినీ ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అత్యంత కఠినమైన ఉగ్రవాద చట్టం ఉపా కింద అరెస్టయిన వీరిద్దరికీ తొలుత 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీని కోర్టు విధించింది.
పదిహేను రోజుల జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో పుర్కాయస్థ, చక్రవర్తిని కోర్టు ముందు హాజరుపర్చారు. కొంతమంది సాక్షులను ఎదుట కూర్చోబెట్టి విచారించాల్సి ఉన్నందున వారిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా.. అందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను పుర్కాయస్థ, చక్రవర్తి తరఫు న్యాయవాది అర్ష్‌దీప్ సింగ్ ఖురానా వ్యతిరేకించారు. ఆ పిటిషన్‌లో కొత్త అంశాలేవీ లేవని వాదించారు.