ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్టు

విధాత : గ్రూప్ 2 విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్య ఘటనలో పోలీసులు మరో ట్విస్టు ఇచ్చారు. ఈ కేసులో పోలీసులు నిందితుడిగా పేర్కోన్న శివరామ రాథోడ్ బెయిల్ రద్దు కోరుతూ గతంలో పోలీసులు కోర్టులో అప్పిల్ చేశారు. పోలీసుల పిటిషన్ పై గతంలో శివరాం రాథోడ్ కి నోటీసులు కూడా జారీ అయ్యాయి. సోమవారం అనూహ్యంగా చిక్కడపల్లి పోలీసులు శివరాం రాథోడ్ బెయిల్ పిటిషన్ రద్దుకు సెషన్ కోర్టులో వేసిన అప్పిల్ పిటిషన్ విత్ డ్రా చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ కేసులో పోలీసులు పలు సందర్భాల్లో తమ స్టాండ్ మార్చుకుంటూ వెలుతుండటంతో కేసు మలుపుల దారిలో ఆసక్తికరంగా సాగుతోంది.