రేషన్ బియ్యం లారీ పట్టివేత..
విధాత:పట్టుబడ్డ బియ్యం బస్తాల లారీ , నిందితులతో విజిలెన్సు అధికారులు.వేంపల్లెలో ఆదివారం కడప విజిలెన్సు అధికారులు దాడులు నిర్వహించి 400 రేషన్ బియ్యం బస్తాల లోడు కలిగిన లారీని పట్టుకున్నారు.విజిలెన్సు ఏఎస్పీ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సై రంగస్వామి తమ సిబ్బందితో కలసి ఇక్కడి పులివెందుల బాహ్యవలయ రహదారి వద్ద కర్ణాటకకు తరలిస్తున్న బియ్యం లారీని పట్టుకున్నారు.ఇద్దరు వ్యక్తులు కడప నుంచి బియ్యం తరలిస్తుండగా దాడులు చేసి ఆ లారీని జప్తు చేశారు .సదరు లారీని వేంపల్లె పోలీసుస్టేషన్లో […]

విధాత:పట్టుబడ్డ బియ్యం బస్తాల లారీ , నిందితులతో విజిలెన్సు అధికారులు.వేంపల్లెలో ఆదివారం కడప విజిలెన్సు అధికారులు దాడులు నిర్వహించి 400 రేషన్ బియ్యం బస్తాల లోడు కలిగిన లారీని పట్టుకున్నారు.విజిలెన్సు ఏఎస్పీ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సై రంగస్వామి తమ సిబ్బందితో కలసి ఇక్కడి పులివెందుల బాహ్యవలయ రహదారి వద్ద కర్ణాటకకు తరలిస్తున్న బియ్యం లారీని పట్టుకున్నారు.ఇద్దరు వ్యక్తులు కడప నుంచి బియ్యం తరలిస్తుండగా దాడులు చేసి ఆ లారీని జప్తు చేశారు .సదరు లారీని వేంపల్లె పోలీసుస్టేషన్లో అప్పగించారు .