కేసీఆర్ పై కేసు నమోదు చేయండి.. హైకోర్టు ఆదేశాలు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎక్సెలెన్స్ సెంటర్ ఏర్పాటు కోసం స్థల కేటాయింపు వివాదమైంది

విధాత: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎక్సెలెన్స్ సెంటర్ ఏర్పాటు కోసం స్థల కేటాయింపు వివాదమైంది. ఈ నేపథ్యంలోనే ఆపార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తో పాటు అప్పటి రెవెన్యూ సెక్రెటరీ నవీన్ మిట్టల్, ప్రధాన కార్యదర్శిపైనా కేసులు నమోదు చేయాలని గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ ను ఆదేశించింది. బీఆరెస్ ఎక్సెలన్స్ సెంటర్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం కోకాపేటలో 11 ఎకరాల స్థలం కేటాయించింది. ఇందు కోసం సర్వే నంబర్ 239, 240 లో ప్రబుత్వం స్థలాన్ని కేటాయిస్తూ గతేడాది మెమో నంబర్ 12425ను ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం జారీ చేసింది. ఈ స్థలంలో బీఆరెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎక్సెలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పొందుపరిచారు. ఈభూమి లావాదేవీలతో సంబంధం ఉన్న రెవెన్యూ శాఖ అధికారులను కూడా జవాబుదారీ చేయాలంటూ బెంచ్ ఆదేశించింది. తదుపరి విచారణను మరో పిటిషన్ నంబర్ 45/2024తో అటాచ్ చేస్తున్నటుల డివిజన్ బెంచ్ స్పష్టతనిచ్చింది.