విధాత(గుంటూరు): పోలీసు ఉన్నతాధికారి వేధింపులతో చుండూరు ఎస్ఐ శ్రావణి, కానిస్టేబుల్ రవీంద్ర ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన శ్రావణి గతంలో నరసరావు పేట దిశ పోలీస్ స్టేషన్‌లో పని చేసింది.
గుంటూరు జిల్లా, కార్ల పాలెం గ్రామానికి చెందిన రవీంద్ర కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఎస్ఐ శ్రావణి, కానిస్టేబుల్ రవీంద్ర కొద్ది కాలంగా కలసి ఉంటున్నారు. శ్రావణి .. రవీంద్రను కుటుంబ సభ్యుల్లో ఒకడిగా, పెద్ద కొడుకుగా చూసుకునేది.
అయితే ఓ పోలీసు ఉన్నతాధికారి వీరిపై పుకార్లు పట్టించినట్లు తెలిసింది. వాటిని భరించలేక ఇద్దరూ ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. ప్రస్తుతం శ్రావణి, రవీంద్ర గుంటూరులోని వేర్వేరు ఆసుపత్రుల చికిత్స పొందుతున్నారు.