విధాత(నెల్లూరు): ఏసీబీ అధికారినంటూ ఓ వ్యక్తి నుడా అధికారులను బెదిరించాడు. దీనిపై దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల మూడో తేదీ నుడా వైస్ ఛైర్మన్ కె.రమేష్, జూనియర్ ప్లానింగ్ అధికారి మురళికి ఫోన్ చేసి తాను ఏసీబీ డీఎస్పీ రవికుమార్‌నంటూ ఓ వ్యక్తి పరిచయం చేసుకున్నారు.
ఇందుకూరుపేటలో షఫీ, హమీద్‌లకు చెందిన భవన నిర్మాణానికి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కోరాడు. లేదంటే మీ ఇష్టమంటూ అధికారులను బెదిరించాడు. దాంతో వారు జరిగిన విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. విచారణలో ఫోన్ చేసిన వ్యక్తి ఏసీబీ డీఎస్పీ కాదని తేలింది. దీంతో నుడా వైస్ ఛైర్మన్ దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరమ్మ కేసు దర్యాప్తు చేస్తున్నారు.