విధాత(ఫిరంగిపురం ): గుంటూరు జిల్లా ఫిరంగిపురం జోసిల్ కంపెనీ వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళుతున్న వారిని కారు బలంగా ఢీ కొట్టడంతో అందులోని ముగ్గురు చనిపోయారు.
వివరాలు ఇలా ఉన్నాయి. తాళ్ళూ రుకు చెందిన షేక్. చిన్న హుసేన్ (50), షేక్. నూర్జహా (45), షేక్ హుస్సేన్ (25) లు ద్విచక్రవాహనంపై అమరావతి లోని ఓ గుడిలో నిద్ర చేసేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో కారు జోసిల్ కంపెనీ వద్ద ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
వాహనాన్ని ఢీ కొట్టి పారిపోతున్న కారుని స్థానికులు అడ్డుకున్నారు. అప్పటికీ సంఘటన స్థలానికి చేరుకోని పోలీసుల వద్దకు కారు డ్రైవర్ వెళ్ళి.. దాన్ని స్వల్ప ప్రమాదంగా చిత్రీకరించి అక్కడ నుండి జారుకున్నారు. న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.