సిద్దిపేట జిల్లాలో విషాదం..చెరువులో ముగ్గురు సఫాయి కార్మికులు గల్లంతు

బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామంలోని చెరువు మెట్లను శుభ్రం చేస్తున్న క్రమంలో కాలుజారి ముగ్గురు గ్రామపంచాయతీ సఫాయి కార్మికులు చెరువులో గల్లంతయ్యారు.

సిద్దిపేట జిల్లాలో విషాదం..చెరువులో ముగ్గురు సఫాయి కార్మికులు గల్లంతు

– తిగుల్ గ్రామంలో బతుకమ్మ పండుగ వేళ ఘటన

– ముమ్మరంగా గాలింపు చర్యలు

విధాత, మెదక్ బ్యూరో: బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామంలోని చెరువు మెట్లను శుభ్రం చేస్తున్న క్రమంలో కాలుజారి ముగ్గురు గ్రామపంచాయతీ సఫాయి కార్మికులు చెరువులో గల్లంతయ్యారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామంలో శనివారం జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలివి. తీగుల్ గ్రామంలో బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామంలో ఉన్న చెరువు వద్ద మెట్లను శుభ్రం చేస్తున్నారు. ఈక్రమంలో కార్మికులు ప్రమాదవశాత్తూ చెరువులో పడిపోయారు.

ఒకరిని కాపాడబోయి మరొకరు జారి చెరువులో పడిపోయారు. గల్లంతైన వారిలో గ్రామపంచాయతీ సిబ్బంది గిరిపల్లి భారతి, యెళ్ళం యాదమ్మ, కర్రెమల్ల బాబు ఉన్నారు. ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోయారు. తోటి వారు గమనించి గ్రామ సర్పంచ్ కప్పర భాను ప్రకాష్ కు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, గ్రామస్తుల సహకారంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.