Debt | అప్పులతో ఆగమైపోతున్నారా..? ఇలా 5 శుక్రవారాలు చేస్తే రుణ విముక్తి ఖాయం..!!
Debt | ఈ భూమ్మీద ఉన్న ప్రతి మనిషి కోటీశ్వరుడు కావాలనుకుంటాడు. కానీ అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. అందరికీ సాధ్యం కాదు. కోటీశ్వరుడు కావాలనుకున్న వాడు.. ఏదో ఒక చోట అప్పు( Debt )ల ఊబిలో కూరుకుపోతాడు.

Debt | ప్రతి ఒక్కరూ ఆర్థికంగా స్థిరపడాలని కలలు కంటుంటారు. అందుకు అనుగుణంగా రాత్రింబవళ్లు కష్టపడి డబ్బు( Money ) కూడబెడుతుంటారు. అయినప్పటికీ ఆ డబ్బు నీళ్ల మాదిరి ఖర్చు అవుతుంటుంది. అప్పు( Debt )లు అధికమైన ఆగమైపోతుంటారు. సమాజంలో మనల్ని ఎవరూ పట్టించుకోరు. అదే ధనం పుష్కలంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సంతోషంగా జీవించొచ్చు. సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. మరి అప్పుల ఊబి నుంచి బయటపడాలంటే.. కొన్ని పరిహారాలు చేయాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. తప్పకుండా రుణ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పండితులు పేర్కొంటున్నారు.
అప్పుల నుంచి గట్టేందుకు చేయాల్సిన పరిహారాలు ఇవే..
- వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందాలంటే ఇంటి అలంకరణ, దేవుని మందిరంలో వెండితో చేసిన ఏనుగు బొమ్మలు పెడితే ఆర్థికంగా శుభ ఫలితాలు కలుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది.
- వెండి ఏనుగులను ఇంట్లో ఈశాన్య దిక్కులో ఉంచితే సకల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. వెండి ఏనుగు బొమ్మను ఇంట్లో దేవుడి గదిలో పెడితే ఆర్థిక కష్టాలు, సమస్యలు అన్నీ పోతాయని వాస్తు పండితులు చెబుతున్నారు.
- ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు శుక్రవారం కనకధారా స్తోత్రం చదువుకుని లక్ష్మీదేవికి ఇష్టమైన పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి. ఇలా 5 శుక్రవారాలు చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
- శుక్రవారం మహిళలు స్నానం చేసే నీటిలో, అలాగే ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేసినట్లయితే దృష్టి దోషాలు తొలగిపోయి రుణ విముక్తి కలుగుతుంది.
- మంగళ శుక్రవారాల్లో ఎవరికీ డబ్బును ఇవ్వకూడదు. ఇలా ఇవ్వడం వలన ఆర్థికంగా అనేక కష్టాలు ఎదుర్కోవలసి వస్తుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.
- శుక్రవారం లక్ష్మీదేవికి తేనే కలిపిన పచ్చిపాలు నైవేద్యంగా సమర్పిస్తే సిరి సంపదలకు లోటుండదని అంటారు.