Vastu Tips | రాత్రి వేళ బ‌ట్ట‌లు ఉతుకుతున్నారా..? అశుభాలు త‌ప్ప‌వ‌ట‌.. జ‌ర జాగ్ర‌త్త‌..!!

Vastu Tips | చాలా మంది మ‌హిళ‌లు( Women ) మురికి బ‌ట్ట‌ల‌ను( Dirty Clothes ) ఉద‌యం లేదంటే మ‌ధ్యాహ్నం వేళ ఉతుకుతుంటారు. కొంద‌రైతే రాత్రి వేళ బ‌ట్ట‌ల‌ను ఉతుకుతారు. ఇలా రాత్రి వేళ బ‌ట్ట‌లు ఉతికితే ఆ ఇంట అశుభాలు త‌ప్ప‌వ‌ని వాస్తు నిపుణులు( Vastu Experts ) హెచ్చ‌రిస్తున్నారు.

Vastu Tips | రాత్రి వేళ బ‌ట్ట‌లు ఉతుకుతున్నారా..? అశుభాలు త‌ప్ప‌వ‌ట‌.. జ‌ర జాగ్ర‌త్త‌..!!

Vastu Tips | ఇటీవ‌లి కాలంలో గృహిణులు( Women ) కూడా బిజీ లైఫ్( Busy Life ) గ‌డుపుతున్నారు. వంటింటికే ప‌రిమితం కాకుండా.. బ‌య‌ట‌కు వెళ్లి ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇలా మ‌హిళ‌లు తీరిక లేకుండా బిజీ అయిపోతున్నారు. దీంతో ఉద‌యం చేయాల్సిన ప‌నుల‌ను సాయంత్రం, రాత్రి వేళ‌ల్లో చేస్తున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆ ఇంట్లో అశుభాలు సంభ‌విస్తాయ‌ని, నెగిటివ్ ఎన‌ర్జీ( Negative Energy ) ప్ర‌వేశించి స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంద‌ని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

చాలా మంది మ‌హిళ‌లు ఆఫీసుల నుంచి ఇంటికి వ‌చ్చాక రాత్రి స‌మ‌యాల్లో బ‌ట్ట‌ల‌ను( Dirty Clothes ) ఉతుకుతుంటారు. ఇది మంచిది కాద‌ని వాస్తు నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. మురికి బ‌ట్ట‌లు ఉతికేందుకు కూడా వాస్తు నియ‌మాలు( Vastu Tips ) పాటించాల‌ని చెబుతున్నారు. సూర్యాస్త‌మ‌యం కంటే ముందే బ‌ట్ట‌లు ఉత‌కాల‌ని, రాత్రివేళ బ‌ట్ట‌లు ఉతికితే.. స‌మ‌స్య‌లు ఏర్ప‌డుతాయ‌ని పేర్కొంటున్నారు. అయితే రాత్రి సమయంలో ఉతికిన బట్టలు ధరించడం చాలా అశుభకరమైనవిగా, అనారోగ్య కరమైనవి అని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

రాత్రి వేళ బ‌ట్ట‌లు ఎందుకు ఉత‌క‌కూడ‌దంటే..?

  • వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి సమయంలో బట్టలు ఉతకడం సరికాదు. రాత్రి సమయంలో బట్టలు ఉతికితే.. ఆ తడి బట్టలు ఆరు బయట ఆరబెట్టవద్దు. ఇది ఆనందం, శ్రేయస్సుకు ఆటంకం కలిగిస్తుంది.
  • వాస్తు శాస్త్రం ప్రకారం బట్టలను ఎప్పుడూ సూర్యోదయం తర్వాత మాత్రమే ఉతుక్కోవాలి. ఉతికిన బట్టలను సూర్యరశ్మిలో ఆరబెట్టడం మంచిది. ఎండలో బట్టలను అరబెట్టడం వలన ప్రతికూల శక్తి పోతుంది.
  • అంతేకాదు ఎండలో ఆరబెట్టిన బట్టల్లో ఉండే హానికరమైన క్రిములు కూడా నాశనం అవుతాయి. అలా ఎండలో ఆరబెట్టిన దుస్తులు ధరించినప్పుడు ఆరోగ్యానికి ఆరోగ్యం.. శరీరంలో పాజిటివ్ ఎనర్జీ కూడా ప్రసారం అవుతుంది.
  • వాస్తుశాస్త్రం ప్రకారం రాత్రి సమయంలో ప్రతికూల శక్తి పుష్కలంగా ఉంటుంది. రాత్రి బట్టలు ఉతకడం, బయట ఆరబెట్టడం వల్ల బట్టల్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అంతేకాదు బట్టల్లో ఉన్న క్రిములు.. చల్లదనానికి అందులో ఉంటాయి. చల్లదనంలో ఆరబెట్టిన బట్టలను ధరించడం ఆరోగ్యానికి హానికరం. ప్రతికూల శక్తి శరీరానికి ఏ విధంగానూ మంచిది కాదు.