చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేషం
మేషరాశి వారికి ఈ రోజంతా సుఖంగా, శాంతిమయంగా గడుస్తుంది. అన్ని రంగాల వారికి ధనలాభం, పనిలో పురోగతి ఉంటాయి. తిరుగులేని విజయాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మాతృ వర్గం నుంచి ధనలాభం ఉండవచ్చు. బంధుమిత్రులతో విందువినోదాల్లో పాల్గొంటారు.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. ప్రతీ సమస్యకు ఓ పరిష్కారం ఉంటుందని గుర్తుంచుకోండి. వ్యాపారస్థులకు తోటి వ్యాపారుల నుంచి తీవ్రమైన పోటీ ఉండవచ్చు.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్థులకు నూతన పెట్టుబడులు లాభాలను అందిస్తాయి. కీలకవ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవడం పట్ల సందిగ్దతకు లోనవుతారు. మొహమాటాలకు పోతే నష్టపోతారు. చిన్న చిన్న సమస్యల పట్ల అతిగా స్పందించడం అనవసరం.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు అదృష్టకరంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి అపురూపమైన కానుకలు అందుకుంటారు. ఉద్యోగస్థులకు పని ప్రదేశంలో అనుకూలత ఉంటుంది. పదోన్నతి యోగం ఉంది. వ్యాపారస్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు సాధారణంగా గడుస్తుంది. మీ లక్ష్యం దిశగా పనిచేసి మంచి విజయాలను సాధిస్తారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ ఖచ్చితంగా ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. నిర్ణయాలు తీసుకునే సమర్ధత లోపిస్తుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారస్థులకు మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.
తుల
తులారాశి వారికి ఈ రోజు సంతోషకరంగా ఉంటుంది. ఈ రోజంతా పూర్తిగా ఆనందంగా ఉంటారు. నూతన వ్యక్తులతో పరిచయం మేలు చేస్తుంది. వ్యాపారస్థులు విపరీతమైన లాభాలను గడిస్తారు. సన్నిహితులతో విందువినోదాల్లో పాల్గొంటారు.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు. అన్ని రంగాల వారికి ఈ రోజు కార్యసిద్ధి, జయం ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. బంధువుల నుంచి అందిన శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. ఆర్ధికంగా బలోపేతం అవుతారు.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. తీవ్రమైన అనారోగ్య సమస్యల కారణంగా మానసిక అశాంతికి లోనవుతారు. ఉద్యోగస్థులకు పనిభారం ఎక్కువ కావడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్థులు రావాల్సిన బకాయిలు చేతికి అందక రుణాలు చేయాల్సి వస్తుంది.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్థులు ఆర్థికంగా నష్టపోవచ్చు. స్థిరాస్తి రంగం వారికి శుభ ఫలితాలు ఉంటాయి. శారీరకంగా దృఢంగా, మానసికంగా సంతోషంగా ఉంటారు. కుటుంబంలో జరిగిన కొన్ని అనుకోని సంఘటనలు ఆందోళన కలిగిస్తాయి.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వ్యాపారస్థులు బద్దకాన్ని వీడి శ్రమిస్తే లాభాలు దక్కుతాయి. వివాదాలకు దూరంగా ఉంటే మేలు. కీలక వ్యహారాల్లో నిర్ణయాలు తీసుకోవడం పట్ల గందరగోళానికి గురవుతారు. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. డబ్బుకు సంబంధించిన విషయాలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహించండి. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.