08.05.2024 బుధ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశుల వారికి అనారోగ్య స‌మ‌స్య‌లు..!

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

08.05.2024 బుధ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశుల వారికి అనారోగ్య స‌మ‌స్య‌లు..!

మేషం

మేషరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఈ రోజు కొత్తగా ఏ పనులు మొదలు పెట్టవద్దు. కోపాన్ని నియంత్రిచుకోండి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటలు అదుపులో ఉంచుకోండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయం తీసుకునే ముందు బాగా అలోచించి ఒక దృఢమైన నిర్ణయానికి వస్తే మేలు. తొందరపాటు నిర్ణయాలు ప్రమాదకరంగా పరిణమిస్తాయి. ఖర్చులు అధికం అవుతాయి.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. దైవబలం మీకు అండగా ఉంటుంది. వ్యాపాస్థులకు ధన ప్రవాహం ఉంటుంది. ఆర్ధికంగా పలు ప్రయోజనాలను అందుకుంటారు.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంట్లో వేడుకలు జరుగుతాయి. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులు ఉంటాయి. ఉద్యోగస్థులకు పని భారం పెరుగుతుంది.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు పొందాలంటే తీవ్రంగా శ్రమించాలి. ఆరోగ్యం సహకరించదు. ఆర్ధిక నష్టాలు సూచితం. సహనంతో ఉంటే అన్ని సర్దుకుంటాయి.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఏదైనా కొత్తగా ప్రారంభించడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా ఉండడం మేలు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

తుల

తులారాశి వారికి ఈ రోజు సరదాగా, సంతోషంగా గడిచిపోతుంది. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆకస్మిక ధన లాభం ఉండవచ్చు.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. సన్నిహితుల నుంచి అందిన శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. గతంలో వాయిదా పడిన పనులు కూడా ఈ రోజు పూర్తి చేస్తారు.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు గ్రహ సంచారం అనుకూలంగా లేదు. పని ఒత్తిడి కారణంగా అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. మానసికంగా అశాంతితో ఉంటారు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలహాలు ఉండవచ్చు.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపార రంగాలవారికి అనుకూలంగా లేదు కాబట్టి ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటే మంచిది. ఆరోగ్యం బాగుండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అనవసర ఆందోళనలను తొలగించుకుంటే, అన్ని పనుల్లో విజయం మీదే! రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. పై అధికారులతో, కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ఎవరికీ రుణాలు ఇవ్వద్దు రుణాలు తీసుకోవద్దు.