భోజనం చేశాక ఎన్ని నిమిషాలకు స్నానం చేయాలో తెలుసా..?
Bathing | చాలా మందికి భోజనం( Meals ) చేసిన వెంటనే స్నానం( Bath ) చేసే అలవాటు ఉంటుంది. కానీ అలా చేయడం మంచిది కాదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అలా చేస్తే అదృష్ట లక్ష్మి( Lakshmi Devi ) అనుగ్రహం సంపూర్ణంగా లభించదట.

Bathing | హిందూ ఆచార వ్యవహారాల్లో( Hindu Customs ) స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. స్నానం( Bathing ) ఆచరించిన తర్వాతనే మన రోజువారి కార్యకలాపాలు ప్రారంభించాలని పెద్దలు చెబుతుంటారు. అయితే పొద్దున, సాయంత్రం వేళ స్నానం( Bath ) చేస్తుంటారు. కొందరైతే ఉదయం టిఫిన్( Breakfast ) చేశాక, రాత్రి డిన్నర్( Dinner ) అయిన తర్వాత స్నానం చేస్తుంటారు. ఇలా చేయడం ఆ వ్యక్తి యొక్క జీవితానికి ఏ మాత్రం మంచిది కాదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. తిన్న తర్వాత కనీసం అర గంటకు పైగా విరామం ఇవ్వాలి. ఆ తర్వాతే స్నానం ఆచరించాలని సూచిస్తున్నారు.
కొంతమందికి తిన్న వెంటనే స్నానం చేసే అలవాటు ఉంటుంది. కానీ, ఎట్టిపరిస్థితుల్లో ఇలా చేయకూడదని పండితులు హెచ్చరిస్తున్నారు. మనం ఆహారం తీసుకున్న తర్వాత ఎన్ని నిమిషాలకు స్నానం చేయాలో శాస్త్రంలో చెప్పారు. తిన్న తర్వాత 48 నిమిషాలకు స్నానం చేస్తే మంచిదట. దీనిని ముహూర్త కాలంగా పిలుస్తారు. ఇలా.. స్నానానికి ముందు తర్వాత ఈ తప్పులు చేయకుండా ఉంటే.. అదృష్టలక్ష్మి( Lakshmi Devi ) అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని జ్యోతిష్య పండితుల నమ్మకం.
ఇక స్నానం ఆచరించిన తర్వాత చాలా మంది తప్పులు చేస్తుంటారు. ఖాళీ బకెట్( Bucket )ను అలానే ఉంచుతుంటారు. వాస్తు నియమాల ప్రకారం.. స్నానాల గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ బకెట్ని ఖాళీగా ఉంచకూడదట. ఒకవేళ బకెట్ని బాత్రూమ్లో పెట్టాల్సి వస్తే దానిని బోర్లించి ఉంచాలట. చాలా మంది స్నానం చేసిన తర్వాత మిగిలిన నీళ్లను కాళ్ల మీద పోసుకుంటుంటారు. కానీ, వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయకూడదట.
స్నానం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ బాత్రూమ్( Bath room ) క్లీన్గా ఉండేలా చూసుకోవాలి. స్నానాల గది అశుభ్రంగా ఉండడం వల్ల నెగటివ్ ఎనర్జీ( Negative Energy ) వ్యాపిస్తుందట. కుటుంబంలో గౌరవ మర్యాదలు తగ్గిపోతాయని చెబుతున్నారు. కాబట్టి.. స్నానం పూర్తైన తర్వాత విడిచిన వస్త్రాలు గానీ, తడి వస్త్రాలు స్నానాల గదిలో లేకుండా చూసుకోవాలి.