గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి వాహ‌న ప్ర‌మాదం..! జ‌ర జాగ్ర‌త్త‌..!!

Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి వాహ‌న ప్ర‌మాదం..! జ‌ర జాగ్ర‌త్త‌..!!

మేషం

మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. ఆదాయంలో వృద్ధి లేకపోవడం వల్ల నిరుత్సాహంగా ఉంటారు. కుటుంబ విషయాలలో కొంచెం దూకుడు తగ్గించుకుంటే మంచిది.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాలవారు వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు పొందాలంటే తీవ్రంగా శ్రమించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. వ్యాపారులకు ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరగడం వల్ల ఒత్తిడికి లోనవుతారు.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. వృత్తిలో హోదా పెరగడం వల్ల సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సంతోషంగా విహారయాత్రలకు వెళతారు. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు ఉద్యోగులకు ఫలప్రదంగా ఉంటుంది. మీరు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి కావడం వల్ల ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. పదోన్నతులు పొందుతారు. కుటుంబలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. వ్యాపారులు మంచి లాభాలను అందుకుంటారు.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. శుభ సమయం నడుస్తోంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం వెన్నంటే ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి తిరుగులేని విజయాలను అందుకుంటారు. అమోఘమైన కల్పనాశక్తితో రచనలు చేసి సమాజంలో మంచి గుర్తింపును పొందుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సంతానం పురోగతి పట్ల సంతృప్తితో ఉంటారు.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. గ్రహ సంచారం అనుకూలంగా లేనందున ఈ రోజు వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. ఇంటా బయటా సహచరులతో కలహాల కారణంగా ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంటుంది. తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆర్థిక నష్టం సంభవించే సూచన ఉంది.

తుల

తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వెచ్చించి వృత్తి వ్యాపారాలలో తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంటారు. ఉద్యోగులకు శుభ సమయం నడుస్తోంది. పని పట్ల మీ అంకితభావానికి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళతారు. సంపదలు వృద్ధి చెందుతాయి.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతులతో పాటు స్థానచలనం కూడా ఉండవచ్చు. కీలక వ్యవహారంలో న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా తగిన జా గ్రత్తలు తీసుకోండి.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో భారీ నష్టాలు ఉండే ప్రమాదముంది. బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యాలకు హాజరవుతారు. వైవాహిక జీవితం ఆనందదాయకంగా గడుస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ రోజు ఆధ్యా త్మి కమైన కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ధార్మిక కార్యక్రమాల కోసం విరివిగా ఖర్చు చేస్తారు. అపాత్ర దానం చేయవద్దు. కోర్టు, న్యాయ పరమైన విషయాలలో శ్రద్ధ పెట్టకపోతే నష్ట పోతారు. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో ఊహించని లాభాలతో సంతోషంగా ఉంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. సమాజంలో ప్రతిష్ఠ, ప్రజాదరణ పెరగవచ్చు. ఉద్యోగంలో ప్రశంసలు, పదోన్నతులు ఉంటాయి. సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. అన్ని రంగాల వారు ఈ రోజు వృత్తి వ్యాపారాలలో కఠినమైన సమస్యలను ఎదుర్కొంటారు. వరుస అపజయాలతో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఆరోగ్యం బాగుండదు. ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. వీలైనంత వరకు ప్రశాంతంగా గడపండి.