చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేషం
మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తివ్యాపార రంగాల వారికి అన్ని విధాలా పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. గతంలో వాయిదా పడిన పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు ప్రభావవంతంగా ఉంటుంది. మీ సామర్ధ్యాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తిస్తారు. సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్ధికంగా ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఎవరు మంచివారో, ఎవరు చెడ్డవారో అంచనా వేయడం కష్టం అవుతుంది. వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసివస్తాయి. ఓ శుభవార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఆర్ధికంగా సామాన్యంగా ఉంటుంది.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. భవిష్యత్ గురించి చక్కని ప్రణాళికలు రూపొందిస్తారు. ఇందువలన సమయం వృధా కాదు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఖర్చులు పెరుగుతాయి.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు వేగవంతంగా, ముందుచూపుతో ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. దూకుడుతో తీసుకునే నిర్ణయాల వలన నష్టం రావచ్చు. ఆదాయం వృద్ధి చెందుతుంది.
కన్య
కన్యారాశి వారికి సామాన్యంగా ఉంటుంది. గతంలో చేసిన పొరపాట్ల నుంచి పాఠం నేర్చుకుంటారు. ఎన్నో రోజులుగా అపరిష్కృతంగా ఉన్న వివాదాలకు ముగింపు పలుకుతారు. ప్రత్యర్థులు ఉంటేనే నిజమైన పురోగతి సాధిస్తామనే మాటను నమ్ముతారు.
తుల
తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంతర్గతంగా మీలోని శక్తిని వెలికి తీసి బంగారు భవిష్యత్ కు పునాదులు వేసుకుంటారు. ఎన్నో రకాల అవకాశాలు ఈ రోజు మీ ఇంటి తలుపు తడతాయి. తిరుగులేని విజయాలను సాధిస్తారు.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వదంతులను దూరంగా పెట్టండి. మీ వ్యక్తిగత విషయాలలో ఇతరుల జోక్యం సహించకండి. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. విశ్రాంతి లోపిస్తుంది. ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. న్యాయవివాదంలో తీర్పు మీకు వ్యతిరేకంగా ఉండవచ్చు. ఆర్థికపరంగా నష్టాలు సంభవిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం, దృఢ నిశ్చయంతో పనిచేసి అఖండ విజయాలను అందుకుంటారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది. ఆర్ధికంగా ఊహించని లాభాలను అందుకుంటారు.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉన్నత స్థానంలో ఉండాలంటే తెలివితేటలూ ఒక్కటే సరిపోవు లౌక్యంగా కూడా కావాలి అని గ్రహిస్తారు. సృజనాత్మకంగా వ్యవహరించండి. కొత్త మార్గాలను అన్వేషించండి.