ప్రతి ఒక్కరూ జాతకాలను నమ్ముతుంటారు. దీంతో ప్రతి రోజు తమ రాశి ఎలా ఉంది..? అనే విషయాలను తెలుసుకుని తమ దినచర్యను ప్రారంభిస్తారు. కాబట్టి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ రాశిఫలాలు ఉన్నాయో తెలుసుకుందాం..
మేషం
మేషరాశి వారికి ఈ రోజు మంచి ఫలవంతమైన రోజు. ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. గతంలో వాయిదా పడ్డ పనులు పూర్తవుతాయి. వైద్యవృత్తి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి కలిసి వచ్చే కాలం.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పని చేసి మంచి విజయం సాధిస్తారు. ప్రభుత్వం నించి ఆర్ధిక ప్రయోజనం కలుగుతుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోండి.
మిథునం
మిధునరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ప్రభుత్వ పరంగా లాభాలు పొందుతారు. ఏ పని చేపట్టినా విజయం మీ వెంటే ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్ధిక విషయాల్లో అప్రమత్తత అవసరం.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రతికూల ఆలోచనలు వీడితే మేలు. విద్యార్థులకు ఫలితాలు నిరాశాజనకంగా ఉంటాయి.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆకస్మిక ధనలాభం సూచితం. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. కాలం కలిసి రావడం లేదు. మీకు ఆత్మవిశ్వాసం అనిపించింది ఇతరులకు అహంకారంగా, గర్వంగా అనిపించవచ్చు. మితిమీరిన ఆత్మవిశ్వాసం పనికిరాదు.
తుల
తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంది. పని ప్రదేశంలో ఒకింత గందరగోళం ఉండవచ్చు. పలు అవకాశాలు ఎదురవుతాయి. మీకు నచ్చినది ఎంచుకుని ముందుకు సాగండి. ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనతో సతమతమవుతారు. ప్రశాంతంగా ఉండండి. ఒత్తిడి నుంచి బయట పడటానికి ధ్యానం చేయండి.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీ ప్రతిభతో వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. రావలసిన ధనం చేతికి అందుతుంది.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్ధికంగా ప్రయోజనాలు ఉంటాయి. గృహంలో శాంతి, సౌఖ్యం ఉంటుంది. నూతన వాహన యోగం ఉంది.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. తోటి ఉద్యోగుల సహకారం ఉంటుంది. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది.