చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేషం
మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులను కలుసుకుంటారు. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతి, జీతం పెరుగుదల వంటి ప్రయోజనాలు ఉంటాయి.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు గొప్ప శుభవార్తలు వింటారు. గృహంలో శాంతి, సౌఖ్యం నెలకొంటాయి. కమ్యూనికేషన్, పత్రికారంగం వారికి ఈ రోజు విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. ప్రతిభతో పనిచేసి అందరి ప్రశంసలు అందుకుంటారు.
మిథునం
మిధున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. చెడు అలవాట్లకు బానిస కావద్దు. ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆర్ధిక నష్టం సూచితం. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కుటుంబ సభ్యులతో గొడవ పడకండి. నీటి గండం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ పోటీ దారులు, ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. మీ మిత్రులు, సోదరుల నుంచి లబ్ధి పొందుతారు. బంధుమిత్రులతో విహారయాత్రలకు వెళతారు.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్ధికంగా పురోగతి చెందుతారు. భవిష్యత్ ప్రయోజనాల కోసం కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. అనవసర ఖర్చులు తగ్గించండి. వ్యాపారులకు శ్రమకి తగ్గ ఫలితాలు లభించవు. కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఉంటుంది.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. మీ మంచి మాటలతో అందరినీ ఆకర్షిస్తారు. ఇది మీకు చాలా రకాలుగా లాభం చేస్తుంది. మీ తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. శారీరకంగా, మానసికంగా సంతోషంగా ఉంటారు. శుభవార్తలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
తుల
తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. తన కోపమే తన శత్రువు అన్న విషయం గుర్తుంచుకోండి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే కలహాలు వస్తాయి. ఆరోగ్యం దెబ్బతింటుంది. మీ కోపం కారణంగానే మీ పరువు ప్రతిష్ఠలు దెబ్బతింటాయి.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. అవివాహితులకు ఇది శుభప్రదమైన రోజు. ఆర్థికపరంగా పారిశ్రామికవేత్తలందరూ చాలా లాభపడవచ్చు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు తారాబలం అనుకూలంగా ఉంది. ఈ రోజు విరివిగా దానధర్మాలు చేసి అందరి మెప్పు పొందుతారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు పనిచేసే చోట తమ పై అధికారులను మెప్పిస్తారు.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు తారాబలం అనుకూలంగా ఉంది. మీ ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి మంచి సమయం. వృత్తి, వ్యాపార రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆదాయ వృద్ధి ఉంటుంది.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఈ రోజు చాలా ఇబ్బందులు, ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కోపం, చిరాకు పెరుగుతాయి. మౌనంగా ఉంటూ, ధ్యానం చేస్తే ప్రశాంతంగా గడిపే అవకాశం వుంది. చట్టవిరుద్దమైన పనులు చేయవద్దు. మీ పద్దతి ద్వారా ఇతరులు భాధపడే అవకాశం వుంది.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. సినీ రంగం, కళారంగం వారికి అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు పై సంతకం చేస్తారు. వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాలు మేలు చేస్తాయి. ఆర్ధికంగా పలు ప్రయోజనాలు అందుకుంటారు.