22.05.2024 బుధవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ఊహించని గొప్ప ఉద్యోగం..!
చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం
మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని గొప్ప ఉద్యోగం దొరుకుతుంది. ఉద్యోగులకు మంచి జీతంతో పాటు పదోన్నతులు కలుగుతాయి. మీ శక్తి సామర్ధ్యాలతో, తెలివితేటలతో అందరి దృష్టి ఆకర్షిస్తారు.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఘర్షణలు, వాదనలు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. వ్యాపారులకు ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి.
మిథునం
మిధునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు. వృత్తివ్యాపార రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్ధ యాత్రలకు వెళతారు.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ వృత్తిజీవితం ఓ కీలక ఘట్టానికి చేరుతుంది. నూతన బాధ్యతలు చేపడతారు. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ఆర్ధికంగా బలోపేతం అవుతారు.
సింహం
సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో ఆహ్లాకదరమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో విందువినోదాలలో పాల్గొంటారు. ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగంలో పదోన్నతి, జీతం పెరుగుదల తప్పకుండా ఉంటాయి.
కన్య
కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం కూడా ఈ రాశి వారికి ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మేలు. స్వల్ప అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి.
తుల
తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. వృత్తివ్యాపార రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించండి.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఈ రోజు తారాబలం అద్భుతంగా ఉంది. వృత్తి వ్యాపారాలవారికి, ఉద్యోగులకు కలిసి వచ్చే కాలం. అన్ని రంగాల వారికి ఆర్ధిక ప్రయోయోజనాలు మెండుగా ఉన్నాయి. మీ ప్రతిభతో అందరినీ మెప్పిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది.
ధనుస్సు
ధనుస్సు రాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. ఇంటాబయటా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్ధికంగా బలపడతారు. మీ ప్రతిభకు, తెలివితేటలకు పెద్దల ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
మకరం
మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు తమ ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్ధికంగా శుభసమయం నడుస్తోంది. ఉద్యోగ మార్పు కోరుకునే వారు కొంతకాలం వేచి చూస్తే మంచిది. వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఖర్చులు పెరగవచ్చు. విదేశాల నుంచి శుభవార్త అందుకుంటారు. వ్యాపారస్తులు వ్యాపారంలో గట్టి పోటీని ఎదుర్కొంటారు.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంటే మంచిది.