చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేషం
మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు, ముఖ్యమైన కార్యక్రమాలు మొదలు పెట్టడానికి మంచి రోజు. ఆర్థికంగా పలు ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యంపట్ల శ్రద్ధ అవసరం. కుటుంబ వ్యహారాల్లో శాంతంగా, సమయానుకూలంగా ఉండడం మంచిది.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు స్థాన చలనం ఉండవచ్చు. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఆందోళన ఉండవచ్చు. ఇంటికి బంధు మిత్రుల రాకతో సందడి వాతావరణం నెలకొంటుంది. విదేశాల నుంచి శుభవార్తలు అందుకుంటారు.
మిథునం
మిథునరాశి వారికి ఐశ్వర్య ప్రాప్తి ఉంది. మీలోని సానుకూల శక్తి కారణంగా చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యల చికాకు పెడతాయి. ఉద్యోగులు మొదలు పెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో దీర్ఘకాలిక ప్రణాళికలు వేస్తారు. ఫలితాలు ఊహించనిది కన్నా మెరుగ్గా ఉంటాయి.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గతంలో చేసిన తప్పిదాలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆర్థికంగా అస్థిరత నెలకొంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తే మంచిది. సన్నిహితులతో కోపాన్ని అదుపులో ఉంచుకొని మాట్లాడితే గొడవలు రావు.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. వ్యాపారులు ఆశించిన ఫలితాలను పొందుతారు. సన్నిహితుల సాంగత్యంలో ప్రశాంతత పొందుతారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. వృత్తినిపుణులు, ఉద్యోగులు అనుకోని అవాంతరాల కారణంగా ఒత్తిడికి లోనవుతారు.
తుల
తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అనవసర విషయాలు, అనుకోని సమస్యలు ఈ రోజు ఇబ్బంది పెడతాయి. వ్యాపారులకు రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కోపాన్ని తగ్గించుకొని సహనంతో ఉంటే మంచిది. కుటుంబంలో కలహాలు రాకుండా జాగ్రత్త పడండి.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. మనోబలంతో ముందుకెళ్తే విజయం మీదే. మీ లక్ష్యం చేరుకోడానికి కృషి అవసరం. ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి నిపుణులకు, వ్యాపారులకు కష్టే ఫలి అన్నట్లుగా ఉంటుంది.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. వాహన ప్రమాదం ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి అనుకూలమైన సమయం.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. గృహంలో సంతోషం నెలకొంటుంది. దూరప్రాంతాల నుంచి అందిన శుభవార్తలు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. ఉద్యోగులకు జీతం పెరుగుదల, ప్రమోషన్ ఛాన్స్ ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
కుంభం
కుంభరాశివారికి ఈ రోజు అదృష్ట దాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి లక్ష్మీకటాక్షం, విజయసిద్ధి ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్, జీతం పెంపుదల, ఆఫీసులో ప్రశంసల జల్లులూ ఉంటాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. కుటుంబంతో విహార యాత్రలకు వెళతారు.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఈ రోజు తీసుకునే అన్ని నిర్ణయాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ముఖ్యమైన పనుల్లో విజయం చేకూరుతుంది. రచయితలు, కళారంగం వారు విశేష ప్రతిభ చూపి సన్మాన సత్కారాలు పొందుతారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.