నేటి రాశిఫ‌లాలు.. ఈ రాశివారు ఇల్లు, భూమి కొనుగోలు చేస్తారు..!

Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

నేటి రాశిఫ‌లాలు.. ఈ రాశివారు ఇల్లు, భూమి కొనుగోలు చేస్తారు..!

మేషం

మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఆందోళన కలిగించే అంశాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని నిబ్బరంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీ తల్లి గారి ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రోజు అన్ని రంగాల వారికి వృత్తి పరంగా ఆందోళన, ఒత్తిళ్లు చుట్టుముడతాయి. కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారంతో చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అస్త్యవ్యస్తంగా ఉంటుంది. అదనపు ఆదాయ వనరుల కోసం ప్రయత్నిస్తారు.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో తగినంత ప్రోత్సాహం లేనందున నిరాశగా ఉంటారు. ఆర్థికపరంగా కొన్ని చిక్కులు ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యుల సహకారంతో సమస్యల నుంచి బయట పడతారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి కాబట్టి ప్రశాంతంగా ఉంటారు.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆటంకాలు, సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొంటారు. క్లిష్ట పరిస్థితుల నుంచి సమర్థవంతంగా బయటపడతారు. వ్యాపార, వాణిజ్యాల్లో ఈ రోజు తీవ్రమైన పోటీ ఉన్నప్పటికినీ మీదే పైచేయి అవుతుంది. వృత్తి జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఎటువంటి సమస్యలు, ఆటంకాలు లేకుండా సాగిపోతుంది.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. వ్యాపారులు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. జీవిత భాగస్వామితో మనస్పర్థలు ఏర్పడవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకొని సహనంతో మెలిగితే మేలు.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో చేపట్టిన పనులు విజయాలను అందిస్తాయి. ఓ మిత్రుని సహకారంతో ఎటువంటి ఆటంకాలు లేకుండా కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. సంపదలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు.

తుల

తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గత కొన్ని రోజులుగా వేధించిన సమస్యలు తొలగిపోవడం వల్ల ఇంట్లో ఆనందకరమైన వాతావరణం వెల్లివిరుస్తుంది. ఉద్యోగులు తమ ప్రతిభతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. ఉరకలెత్తించే సంతోషం ఇంటిని ఉత్సాహభరితంగా మార్చుతుంది. వ్యాపారంలో లాభాలు మెండుగా ఉంటాయి.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి పనిప్రదేశంలో పరిస్థితులు కొంత వ్యతిరేకంగా ఉంటాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వారిని పట్టించుకోకండి. ఇతరుల విమర్శలకు అంత ప్రాధాన్యత ఇవ్వకండి. ప్రశాంతంగా ఉండండి. వాదనలు దూరంగా ఉండండి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. గ్రహసంచారం సరిగా లేదు కాబట్టి మంచి చేసినా చెడు ఎదురవుతుంది. ఆర్థిక పరిస్థితి అదుపు తప్పడం వలన మానసిక ఆందోళనకు గురవుతారు. సహనంగా, ఉంటూ సంయమనం పాటిస్తే గమ్యాన్ని చేరుకోవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఎవరితోనో వాదనలు దిగవద్దు.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఉద్యోగ వ్యాపారాలలో కార్యసిద్ధి, శత్రుజయం ఉంటాయి. వ్యాపారులు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. కమిషన్‌, వ్యాపారం, వడ్డీ, రుణాలు, పెట్టుబడులు, మీ ఆదాయాన్ని పెంచుతాయి. భారీ లాభాలను మీరు చూడబోతున్నారు. ఇల్లు, భూమి కొనుగోలు చేస్తారు.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని గ్రహాలు ఉచ్ఛదశలో ఉన్నాయి కాబట్టి వృత్తి వ్యాపార రంగాల వారు ఆర్థిక సంబంధమైన శుభ ఫలితాలు ఈ రోజు అందుకుంటారు. మీ పనితీరుకు, సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి కావడం వల్ల ఈ రోజంతా చాలా సంతోషంగా ఉంటారు.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజు విద్యార్థులకు శుభసూచకంగా ఉంది. తారాబలం బలంగా ఉంది కాబట్టి అన్ని రంగాల వారు కొత్త అవకాశాలు అందుకుంటారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి తిరుగులేని విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు.