చాలా మంది జ్యోతిష్యాన్ని నమ్ముతుంటారు. ఏ పని ప్రారంభించినా సరే తమ రాశుల ఫలితాలను బట్టి పనులను, శుభకార్యాలను ప్రారంభిస్తారు మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేషం
మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటా యి. విశ్రాంతి లేమి, అలసట, బద్దకంతో ఆరోగ్యం లోపిస్తుంది. కోపం, చిరాకు, ఆందోళన కారణంగా పని ప్రదేశంలో ఏకాగ్రత లోపిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. కొత్త పనులు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. పని ఒత్తిడి వలన ఆరోగ్యం దెబ్బ తింటుంది. గృహంలో శాంతి లోపిస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం కాదు.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. ఈ రోజంతా మీరు సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబసభ్యులతో విహారయాత్రకు వెళతారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఊహించని ధనలాభం సూచితం.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు చాలా అదృష్టకరమైన రోజు. బంధు మిత్రుల నుంచి పూర్తి సహకారం అందుతుంది. విందువినోదాలలో పాల్గొంటారు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మేలు. వ్యాపారులకు, ఉద్యోగులకు అదృష్ట యోగం కలగనుంది.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మీ కోప స్వభావాన్నిఅదుపులో ఉంచుకుంటే మేలు. ముఖ్యమైన పనులపై శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం బాగుంటుంది. మంచి మార్కులతో విజయం సాధిస్తారు. ఆదాయవృద్ధి ఉంది.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. సోమరితనం, బద్దకం కారణంగా పనులన్నీ వాయిదా వేస్తారు. కుటుంబసభ్యులతో గొడవలకు దిగుతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వ్యాపారులకు ధననష్టం సూచితం.
తుల
తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. అనేక మార్గాల నుంచి ధనాదాయం ఉంటుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారులకు పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి అనువైన రోజు.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు గ్రహసంచారం అనుకూలంగా లేదు. ఈ రోజు మీరు తప్పనిసరిగా కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే అనుమానాలు, అపార్ధాలతో గొడవలు పెరుగుతాయి. సహనంతో, సంయమనంతో ఉంటే సమస్యలు సద్దుమణుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. పుణ్యక్షేత్రాలు, తీర్థ యాత్రలు చేస్తారు. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయ వృద్ధి ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఈ రోజంతా నిరుత్సాహాంగా గడుస్తుంది. సన్నిహితులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. మీ సంపదకు, ప్రతిష్టకు భంగం కలిగే అవకాశముంది కాబట్టి అప్రమత్తంగా ఉంటే మేలు.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి శుభ సమయం నడుస్తోంది. ఈ శుభ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోండి. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. పలు మార్గాల నుంచి ధన ప్రవాహం ఉంటుంది.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు ఫలవంతమైన రోజు. వృత్తి వ్యాపార రంగాల వారికి అన్ని విధాలా పురోగతి ఉంటుంది. పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఉద్యోగులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.