28 ఏప్రిల్ నుంచి 4 మే వ‌ర‌కు.. ఈ వారం మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

చాలా మంది జ్యోతిష్యాన్ని న‌మ్ముతుంటారు. ఏ ప‌ని ప్రారంభించినా స‌రే త‌మ రాశుల ఫ‌లితాల‌ను బ‌ట్టి ప‌నుల‌ను, శుభ‌కార్యాల‌ను ప్రారంభిస్తారు మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

28 ఏప్రిల్ నుంచి 4 మే వ‌ర‌కు.. ఈ వారం మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

మేషం

ఈ రాశుల వారు ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. సాహోసోపేత‌మైన నిర్ణ‌యాల‌తో గొప్ప విజ‌యాలు వ‌రించే అవ‌కాశం ఉంది. మ‌నోబ‌లంతో స‌కాలంలో ప‌నుల‌ను పూర్తి చేస్తారు. ముఖ్య‌మైన ప‌నుల్లో సానుకూల ఫ‌లితాలు పొందుతారు. మీ ప్ర‌తిభ‌కు అధికారుల నుంచి ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. అప్పులు పెర‌గ‌కుండా చూసుకోవాలి. ఇష్ట‌మైన దేవుడిని పూజిస్తే అన్ని విధాలా లాభం.

వృష‌భం

ఈ రాశుల వారు ఆర్థిక వృద్ధి చెందుతారు. స్థిరాస్తి కొనుగోళ్ల‌లో లాభాలు ఉంటాయి. ప్రారంభించే ప‌నుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మ‌నోధైర్యంతో ముందుకు సాగి సాధిస్తారు. విరోధుల‌కు దూరంగా ఉండాలి. దైవ‌బ‌లం ర‌క్షిస్తోంది. ఒక వ్య‌వ‌హారంలో డ‌బ్బు చేతికి అందుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు.

మిథునం

ఈ రాశుల వారికి ఈ వారాంతం ధ‌న‌యోగం ఉంది. మీరు చేసే ప్ర‌యాణాలు స‌ఫ‌లం అవుతాయి. సుఖ సౌఖ్యాలు పొందుతారు. మీరు చేసే ప‌నిలో ప్ర‌శాంత‌త ఉంటుంది. కుటుంబ శ్రేయ‌స్సు కోరి చేసే ప‌నులు విజ‌య‌వంతం అవుతాయి. శ‌త్రువుల‌పై విజ‌యం సాధిస్తారు. మీ ప‌నితీరుకు అధికారుల నుంచి ప్ర‌శంస‌లు పొందుతారు.

క‌ర్కాట‌కం

క‌ర్కాట‌క రాశి వారికి ఈ వారంలో ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ స‌భ్యుల‌కు ఒక శుభ‌వార్త వినిపిస్తారు. ఒక కీల‌క విష‌యంలో మీ ఆలోచ‌నా ధోర‌ణికి ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. మీ ప‌నితీరుతో పెద్ద‌లు సంతృప్తి చెందుతారు. ఈ వారంలో లాభదాయ‌క‌మైన ఫ‌లితాలు ఉన్నాయి. మ‌రిచిపోలేని విజ‌యాల‌ను సొంతం చేసుకుంటారు.

సింహం

సింహ రాశి వారికి అనారోగ్య స‌మ‌స్య‌లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. మీ మ‌నో ధైర్య‌మే మీకు శ్రీరామ‌ర‌క్ష‌. శ‌క్తి సామ‌ర్థ్యాలు పెరిగి, ప‌నుల్లో పురోగ‌తి ఉంటుంది. శుభ‌కార్య‌క్ర‌మాల్లో ఆనందంగా, సంతోషంగా గ‌డుపుతారు. ఓర్పుతో ఉంటే ఇంకా మంచిది. నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. కొన్ని వార్త‌లు బాధ‌ను క‌లిగిస్తాయి. స‌మాజంలో గౌర‌వం పెరుగుతుంది.

క‌న్య

ఈ రాశి వారు ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ముందుకు సాగితే త‌ప్ప‌క విజ‌యం సిద్ధిస్తుంది. ఆర్థికాంశాల్లో త‌గు జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం. మొహ‌మాటంతో ఇబ్బందుల‌ను ఎదుర్కొంటారు. ఒక వార్త ఆనందాన్ని క‌లిగిస్తుంది. ఆరోగ్యం విష‌యంలో శ్ర‌ద్ధ అవ‌స‌రం. వారాంతంలో మేలు చేకూరే అవ‌కాశం ఉంది. ఉత్సాహంతో ప‌ని చేయాల్సిన స‌మ‌యం ఇది.

తుల

ఈ రాశి వారికి కోరిక‌లు నెర‌వేరుతాయి. వ్య‌యం పెర‌గ‌కుండా చూసుకోవాలి. ఉత్సాహంగా ప‌ని చేస్తే ఫ‌లితం ఉంటుంది. వ్యాపారంలో ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగుల‌కు అనుకూల ఫ‌లితాలు ఉన్నాయి. స్థిరాస్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయి. మ‌న ప‌క్క‌నే ఉండేవారు ఇబ్బందుల‌కు గురి చేసే అవకాశం ఉంది.

వృశ్చికం

వృశ్చిక రాశి వారు ఆరోగ్యాన్ని నిర్ల‌క్ష్యం చేయొద్దు. స‌మ‌స్య‌లకు కుంగిపోకుండా ముందుకు వెళ్తే బెట‌ర్. బంధు, మిత్రుల‌ను క‌లుపుకొని పోవ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించ‌గ‌లుగుతారు. ముఖ్య‌మైన ప‌నుల‌ను వాయిదా వేస్తే మంచిది. చేప‌ట్టిన ప‌నుల్లో ఆటంకాలు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంది. అధికారులు, పెద్ద‌ల‌ను మెప్పించ‌డానికి క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంది.

ధ‌నుస్సు

ఈ రాశివారికి ఈ వారం శుభ‌కాలం న‌డుస్తోంది. మీ మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త‌లు వింటారు. మీ ప‌నితీరుతో అంద‌రినీ ఆక‌ట్టుకుంటారు. ఆత్మీయుల వ‌ల్ల మంచి జ‌రుగుతుంది. ఆస్తిని వృద్ధి చేసే క్ర‌మంలో స‌క్సెస్ అవుతారు. చేసే ప్ర‌తి ప్ర‌య‌త్నం స‌ఫ‌లీకృత‌మ‌వుతుంది. ఇబ్బంది అనిపించిన ప‌నుల‌కు దూరంగా ఉంటే మంచిది.

మ‌క‌రం

మ‌క‌ర రాశివారికి స్థిరాస్తి కొనుగోలు వ్య‌వ‌హారాలు లాభిస్తాయి. ఉద్యోగ ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. కోరుకున్న‌ది అప్ర‌య‌త్నంగా ల‌భ్యం అవుతుంది. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. శుభ‌వార్త వింటారు. శ‌త్రువులు దూరం అవుతారు. మీ ప‌నితీరుకు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. అధికారులు స‌హాయ స‌హ‌కారాలు అందిస్తారు.

కుంభం

ఈ రాశి వారు మ‌నో ధైర్యంతో చేసే ప‌నులు మంచి భ‌విష్య‌త్‌ను ప్ర‌సాదిస్తాయి. ప‌ట్టుద‌ల‌తో చేసే ప‌నులు వెంట‌నే స‌ఫ‌లం అవుతాయి. ఎన్ని ఆటంకాలు ఉన్నా ఉత్సాహం త‌గ్గ‌కుండా చూసుకుంటే మంచిది. మిత్రుల స‌హ‌కారం మేలు చేస్తుంది. కుటుంబ స‌భ్యుల మ‌ధ్య అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. మీ ప్ర‌తిభ‌కు గుర్తింపు లభిస్తుంది. మ‌నోధైర్యాన్ని కోల్పోకూడ‌దు.

మీనం

ఈ రాశివారు ఏకాగ్ర‌త‌తో ప‌ని చేయాలి. మీ మీ రంగాల్లో ఓర్పు, స‌హ‌నం అవ‌స‌రం. ఒక వ్య‌వ‌హారంలో మీ ఆలోచ‌న‌లు అంద‌రి ప్ర‌శంస‌ల‌ను అందుకుంటాయి. ఖ‌ర్చులు పెర‌గ‌కుండా చూసుకోవాలి. బంధు, మిత్రుల‌ను క‌లుపుకొని పోవాలి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం. కీల‌క నిర్ణ‌యాలు తీసుకునేట‌ప్పుడు తొంద‌ర‌పాటు ప‌నికిరాదు. ముఖ్య‌మైన ప‌నుల్లో ఉత్సాహం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. అవ‌స‌రానికి సాయం అందుతుంది.