Horoscope | మే 3, శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి నూత‌న వాహ‌న యోగం..!

Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope | మే 3, శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి నూత‌న వాహ‌న యోగం..!

మేషం

మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చక్కటి ప్రణాళికతో చేపట్టిన పనులు అవలీలగా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు తొలగి విజయాలు చేకూరుతాయి. స్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ముందు చూపుతో నడుచుకోవడం అవసరం. నిర్ణయాలలో స్పష్టత ఉండేలా చూసుకోండి. కుటుంబ సమస్యల పట్ల శాంతంగా స్పందించండి. వ్యాపారంలో పెట్టుబడులు, లాభాలు పెరుగుతాయి. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. మీ పనితీరుకు గుర్తింపు, ప్రశంసలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి నిరాశజనకంగా ఉండవచ్చు. క్లిష్టమైన సమస్యల నుంచి బయటపడేందుకు సన్నిహితుల సహకారం అవసరం. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గతంలో నిర్లక్ష్యం చేసిన అనారోగ్య సమస్యలు తిరిగి ఇబ్బంది పెడతాయి. కోపాన్ని, మాటలను అదుపులో పెట్టుకోండి. కోరి ప్రమాదాలు తెచ్చుకోవద్దు. పెట్టుబడులు, ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యాపారంలో ఆశించిన లాభాలు ఉండకపోవచ్చు. అయితే వ్యక్తిగతంగా ఈ రోజు ఎక్కువ శుభవార్తలు వింటారు. స్థిరమైన ఆదాయం, ఇతర ఆర్థిక వనరుల పెరుగుదలకు అవకాశం ఉంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. దృఢ సంకల్పంతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలలో పట్టుదలతో ఆటంకాలు అధిగమిస్తారు. గృహాలంకరణ కోసం అధికంగా ఖర్చు చేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.

తుల

తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. మీ కోపస్వభావం, మాటతీరుతో కుటుంబ సభ్యులతో , సహచరులతో విభేదాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాలలో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలం కాదు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మీ విజయసంకల్పం అన్నిరంగాల్లో మెరుగైన ఫలితాలు అందిస్తుంది. అన్ని పనులు సమర్ధవంతంగా నిర్వహించి పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. వ్యాపారులు ఈ రోజు మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో అభివృద్ధి పథంలో పయనిస్తారు.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనవసర ప్రయాణాలు, అనవసర ఖర్చులు చికాకు కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. కుటుంబంలో ఐక్యత లోపిస్తుంది. డబ్బు నష్టం కలుగవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఓ ఘటన విచారం కలిగిస్తుంది.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మీ వాక్చాతుర్యంతో ఇంటా బయటా సమస్యలు పరిష్కరిస్తారు. కుటుంబం వాతావరణం ప్రశాంతంగా, ఉల్లాసభరితంగా ఉంటుంది. కీర్తి, గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. విశేషమైన ఆర్థిక లాభాలు అందుకుంటారు. నూతన వాహనయోగం ఉంది. ఆరోగ్యపై శ్రద్ధ పెట్టండి.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాలలో స్థిరత్వం అవసరం. చేపట్టిన పనుల్లో చూపించే శ్రద్ధ, అందుకునే ప్రశంసలు ప్రోత్సాహం అందిస్తాయి. మీ పనితీరు ఉన్నతాధికారులను ఆకట్టుకుంటుంది. మొహమాటానికి పోయి చిక్కుల్లో పడకండి. విజయావకాశాలు, ఆర్థికలాభాలు మెండుగా ఉన్నాయి.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి మంచి ఫలితాలు అందుకుంటారు. వృత్తిపరంగా చాలా కాలంగా పెండింగ్​లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుంచి అందిన శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. వ్యాపారనిమిత్తం చేసే ప్రయాణాలు అనుకూలం. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది.