శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశివారు నష్టపోవాల్సిన చోట లాభాల పంట పండిస్తారు..!
Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం
మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ఈ రోజు కష్టించి పని చేసి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటారు. అంకితభావం, చిత్తశుద్ధి మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఆధ్యాత్మిక, ధార్మిక సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.
వృషభం
వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ రోజు కొత్త పనులు, ఒప్పందాలు చేసుకోడానికి శుభకరంగా ఉంది. చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తవుతాయి. ప్రభుత్వ రంగ ఉద్యోగులు ఉన్నతాధికారుల మద్దతుతో నూతన బాధ్యతలు చేపడతారు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. గొడవలకు, వివాదాలకు దూరంగా ఉండండి.
మిథునం
మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. కొత్తగా ఏ పనులు మొదలుపెట్టవద్దు. ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. అనారోగ్యాల నిమిత్తం అధిక ధనవ్యయం ఉండవచ్చు. మీ ఆరోగ్యం కూడా మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. మానసికంగా తీవ్రమైన ఆందోళన నెలకొంటుంది. ప్రతికూల ఆలోచనలతో మనసు అల్లకల్లోలంగా మారుతుంది. ఎక్కడ తప్పు జరిగిందో అర్ధం కాక అయోమయంతో ఉంటారు. మితిమీరిన కోపం కారణంగా కుటుంబసభ్యులతో కలహాలు పెరుగుతాయి. ఆర్ధిక నష్టం సూచితం.
సింహం
సింహ రాశి వారికి ఈ రోజు విశేషంగా యోగిస్తుంది. ఈ రోజు కొన్ని ముఖ్య వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల మద్దతు ఉంటాయి. ప్రమోషన్, జీతం పెరుగుదల వంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.
కన్య
కన్యా రాశి వారికి ఈ రోజు మంగళకరమైన రోజు. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబంలో సమస్యలు తొలగిపోయి సుఖశాంతులు నెలకొంటాయి. ఆర్ధిక వ్యవహారాలు అవగాహనతో చక్కబెడతారు. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి కావడంతో ఆనందంగా ఉంటారు.
తుల
తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఆర్ధిక వ్యవహారాలు చక్కగా నిర్వహిస్తారు. రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి. నష్ట పోవాల్సిన చోట లాభాల పంట పండించి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. నూతన వస్తాభరణాలు కొనుగోలు చేస్తారు.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ముఖ్యంగా ఈ రోజు అనుకోని ఆపదలు తలెత్తి ఆరోగ్య పరిస్థితి దిగజారే సూచనలు కనిపిస్తున్నాయి. శస్త్రచికిత్స జరిగే అవకాశముంది. కుటుంబ సభ్యులతో గొడవకు దారితీసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆర్ధిక సమస్యలు వెంటాడుతాయి. అవసరానికి ధనం అందక అప్పులు చేయాల్సి వస్తుంది.
ధనుస్సు
ధనుస్సు రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. అదృష్టం వరించి సంపదలు కలిసివస్తాయి. మీ కుటుంబజీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తారు. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారస్తులు ఊహించని లాభాలను అందుకుంటారు. మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది.
మకరం
మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారంలో పెరిగిన పోటీ కారణంగా లాభాలు తగ్గుతాయి. భాగస్వాముల మధ్య మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఆరోగ్య పరిస్థితి దిగజారుతుంది. ఉద్యోగంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవచ్చు. వాహన ప్రమాదాలు జరిగే సూచన ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
కుంభం
కుంభ రాశి వారికి ఈ రోజు ప్రతికూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్యం అసలు సహకరించదు. అనారోగ్య సమస్యల కారణంగా పని పట్ల దృష్టి సారించలేక పోవడం చికాకు కలిగిస్తుంది. ఉద్యోగులకు చేపట్టిన పనిలో ఆటంకాల కారణంగా అన్ని పనులు ఆలస్యం అవుతాయి. మీ పనితీరు పట్ల ఉన్నతాధికారులు అసంతృప్తితో ఉంటారు.
మీనం
మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. అనుకోకుండా అనైతికమైన కార్యకలాపాలలో ఇరుక్కోవడం వలన ప్రమాదంలో పడుతారు. కోపం అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రతికూల ఆలోచనలతో వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అనారోగ్య సమస్యలకు వైద్య ఖర్చుల నిమిత్తం అధిక ధనవ్యయం ఉండవచ్చు.