చాలా మంది జ్యోతిష్యాన్ని నమ్ముతుంటారు. ఏ పని ప్రారంభించినా సరే తమ రాశుల ఫలితాలను బట్టి పనులను, శుభకార్యాలను ప్రారంభిస్తారు మరి ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేషం
మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబంతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. విద్యార్థులు మంచి విజయాలను అందుకుంటారు.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు కొత్త పరిచయాలు, స్నేహాలు వలన ప్రయోజనం చేకూరుతుంది. కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అన్ని రకాల వృత్తి వ్యాపార రంగాల వారికి ఈ రోజు చాలా ప్రయోజనాలు ఉంటాయి. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ఈ రోజు పలు రకాల ఆర్థిక ప్రయోజనాలకు ఉంటాయి.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. మహిళ మూలక ధనలాభం ఉంటుంది. ఉద్యోగులకు ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. మానసికంగా ప్రశాంతంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. వైద్యపరమైన వ్యయాలకు చాలా అవకాశం ఉంది. కొన్ని ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని రోజంతా ఇబ్బంది పెట్టవచ్చు. మీరు వాటి నుంచి దూరంగా ఉండాలి.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులకు, వారి భాగస్వాములకు మధ్య చాలా అనుకూలత ఏర్పడుతుంది. నూతన వస్తువులను కొంటారు. స్నేహితులతో విహారయాత్రలకు వెళతారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది.
తుల
తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారు ఈ రోజు వృత్తి పరంగా ప్రయోజనం పొందుతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఈ రోజు చేపట్టిన అన్ని పనులు విజయవంతం కావడానికి అవకాశం ఉంది. రాబడి పెరుగుతుంది.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఈ రోజు ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. విద్యార్థులు పరీక్షలలో విజయం సాధిస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబంలో అస్థిరమైన వాతావరణం వలన మీరు మీ కుటుంబ సభ్యులతో గొడవలు పడతారు. ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల విషయంలో జాగ్రత్త వహించండి. ఆర్థిక నష్టం కలగవచ్చు.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు ఆనందకరంగా గడుస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు అన్నిటిపై శ్రద్ధ వహిస్తారు. ఈ రోజు ఉద్యోగులకు, విద్యార్థులకు అనుకూలంగా ఉండవచ్చు.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవడం కష్టం అనిపిస్తుంది. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మేలు. ఆర్థికంగా నష్టం కలిగే అవకాశముంది విజయం కోసం ఓపికగా ఎదురు చూడాలి.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. కొత్త పనులు ప్రారంభించడానికి శుభసమయం. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.