05 మే నుంచి 11 వ‌ర‌కు.. ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..!

చాలా మంది జ్యోతిష్యాన్ని న‌మ్ముతుంటారు. ఏ ప‌ని ప్రారంభించినా స‌రే త‌మ రాశుల ఫ‌లితాల‌ను బ‌ట్టి ప‌నుల‌ను, శుభ‌కార్యాల‌ను ప్రారంభిస్తారు మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

05 మే నుంచి 11 వ‌ర‌కు.. ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..!

మేషం

ఈ రాశివారు చ‌క్క‌టి ఆలోచ‌నా విధానంతో విజ‌యాల‌ను సొంతం చేసుకుంటారు. చిత్త‌శుద్ధితో ప‌ని చేసి అనుకున్న‌ది సాధిస్తారు. మిత్ర‌బ‌లం పెరుగుతుంది. ఒక వ్య‌వ‌హారంలో మీ ప‌నితీరుకు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. కీల‌కమైన ప‌నుల్లో పురోగ‌తి ఉంటుంది. వారాంతంలో మేలు జ‌రుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధు, మిత్రుల స‌హ‌కారాలు పూర్తిగా ల‌భిస్తాయి.

వృషభం

వృష‌భ రాశి వారు ఏకాగ్ర‌త‌తో ప‌ని చేస్తే అదృష్టం వ‌రిస్తుంది. స‌మాజంలో గుర్తింపు లభిస్తుంది. గృహ‌, వాహ‌న యోగాలు ఉన్నాయి. ఆత్మ‌విశ్వాసంతో ముందుకు సాగి అనుకున్న‌ది సాధిస్తారు. మీ మీ రంగాల్లో శ‌క్తి సామ‌ర్థ్యాలు పెరుగుతాయి. ప్ర‌తిభ‌తో విజ‌యాల‌ను అందుకుంటారు. బంధు, మిత్రుల‌తో ఆనందంగా గ‌డుపుతారు. ఒక శుభ‌వార్త వింటారు. ఆప్తుల స‌హ‌కారంతో మేలైన ఫ‌లితాల‌ను పొందుతారు.

మిథునం

ఈ రాశివారికి వారాంతం మొత్తం అనుకూలంగా ఉంది. చ‌క్క‌టి శుభ‌యోగాలు ఉన్నాయి. అభివృద్ధిలో దూసుకుపోతారు. ఒక శుభ‌వార్త మీ మ‌నోధైర్యాన్ని పెంచుతుంది. భ‌విష్య‌త్‌కు బాట‌లు వేసుకుంటారు. ఆర్థికంగా లాభ‌దాయ‌క‌మైన ఫ‌లితాల‌ను అందుకుంటారు. ప్ర‌యాణాలు చేస్తారు. ఒత్తిడి ఉన్న‌ప్ప‌టికీ ఫ‌లితం పొందుతారు. బుద్ధిబ‌లంతో విజ‌యం సాధిస్తారు.

క‌ర్కాట‌కం

ఈ రాశివారు మ‌నోబ‌లంతో విజ‌యాల‌ను సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. వివాదాల‌కు దూరంగా ఉంటే మంచిది. ఉద్యోగుల‌కు శుభ ఫ‌లితాలు ఉన్నాయి. అన‌వ‌స‌ర‌మైన విష‌యాల‌తో స‌మ‌యాన్ని వృథా చేయొద్దు. ఆర్థిక లావాదేవీల్లో అభివృద్ధి సాధిస్తారు. ప్ర‌శాంతంగా ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకుంటారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి.

సింహం

అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెర‌గ‌కుండా చూసుకోవాలి. ముఖ్య‌మైన ప‌నుల్లో ధైర్యం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. చేయ‌ని పొర‌పాటుకు బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంది. ఆగ్ర‌హావేశాల‌కు లోను కావొద్దు. ఉచిత ప్ర‌సంగాలు చేయ‌కండి. చిత్త‌శుద్ధితో అనుకున్న ప‌ని చేస్తారు. అప‌రిచితుల మాట‌లు న‌మ్మొద్దు. బుద్ధి బ‌లంతో ఆప‌ద‌లు దూర‌మ‌వుతాయి.

క‌న్య

స్వల్ప ప్ర‌య‌త్నంలో అదృష్ట‌వంతులు అవుతారు. శుభ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఒక శుభ‌వార్త మీ ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. శ‌త్రువుల‌పై విజ‌యం సాధిస్తారు. అవ‌స‌రానికి డ‌బ్బు స‌మ‌కూరుతుంది. ఆర్థికంగా క‌లిసివ‌స్తుంది. కీల‌క వ్య‌వ‌హారాల్లో కుటుంబ స‌భ్యుల స‌ల‌హాల వ‌ల్ల మంచి జ‌రుగుతుంది. చ‌క్క‌టి ఆలోచ‌నా విధానంతో ముందుకు సాగి అనుకున్న‌ది సాధిస్తారు. బంధువుల స‌హ‌కారం ఉంటుంది.

తుల

ఈ రాశి వారికి ఆర్థికంగా క‌లిసి వ‌స్తుంది. తోటివారి స‌హ‌కారంతో ఆటంకాల‌ను ఎదుర్కొంటారు. కోరిక‌లు నెర‌వేరుతాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. నూత‌న వ‌స్తువులు కొనుగోలు చేస్తారు. మీరు ఎన్నో రోజుల నుంచి చేయాల‌నుకుంటున్న ఒక ముఖ్య‌మైన ప‌నిని పూర్తి చేస్తారు. ల‌క్ష్యం నెర‌వేరుతుంది. ముఖ్య‌మైన విష‌యాల్లో ప‌ట్టుద‌ల వ‌ద‌ల‌కండి. కాలాన్ని మంచి ప‌నుల కోసం వినియోగించాలి. కుటుంబ స‌భ్యుల‌కు మేలు జ‌రుగుతుంది.

వృశ్చికం

ఈ రాశి వారికి అదృష్ట ఫ‌లాలు ఉన్నాయి. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. శ‌త్రువులు మిత్రులు అవుతారు. స‌మాజంలో గౌర‌వ మ‌ర్యాద‌లు పెరుగుతాయి. ఆరోగ్యం అన్నివిధాలా స‌హ‌క‌రిస్తుంది. వృత్తి, వ్యాపారాది రంగాల్లో అనుకూల వాతావ‌ర‌ణం ఉంటుంది. ప్రారంభించిన ప‌నుల‌ను అనుకున్న స‌మ‌యానికి పూర్తి చేసి పెద్ద‌లు అధికారుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంటారు. స‌మాజంలో గౌర‌వ మ‌ర్యాద‌లు పెరుగుతాయి.

ధ‌నుస్సు

ఈ రాశివారికి ఆర్థిక విష‌యాల్లో సానుకూల ఫ‌లితాలు ల‌భిస్తాయి. సాహోసోపేత‌మైన నిర్ణ‌యాలు గొప్ప విజ‌యాన్ని అందిస్తాయి. బంధు, మిత్రుల స‌హ‌కారం లిస్తుంది. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. చేప‌ట్టిన ప‌నులు స‌జావుగా పూర్తి చేస్తారు. శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది. గిట్ట‌ని వారితో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించండి.

మ‌క‌రం

ఈ రాశివారికి మంచికాలం న‌డుస్తోంది. కొత్త బాధ్య‌త‌లు చేప‌డుతారు. వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాది రంగాల్లో శ్ర‌మ పెరుగుతుంది. మీ ప్ర‌తిభ‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. ఖ‌ర్చులు పెర‌గ‌కుండా చూసుకోవాలి. వారాంతంలో అనుకున్న‌ది సాధిస్తారు. ఆశ‌యాలు నెర‌వేరుతాయి. ఆత్మ‌విశ్వాసంతో ముందుకు సాగాలి. నూత‌న వ‌స్తువులు కొనుగోలు చేస్తారు. ఎలాంటి ప‌రిస్థితుల్లోనూ మ‌నో ధైర్యాన్ని కోల్పోకూడ‌దు.

కుంభం

ఈ రాశి వారు ధ‌ర్మ‌బ‌ద్దంగా ముందుకు సాగితే మంచిది. అవ‌రోధాలను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటారు. తొంద‌ర‌పాటుతో వ్య‌వ‌హ‌రిస్తే స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు. అవ‌గాహ‌న లోపం లేకుండా చూసుకోవాలి. ఏకాగ్ర‌త‌తో ప‌ని చేసి మంచి ఫ‌లితాన్ని సాధిస్తారు. ప్రారంభించిన ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రిస్తే ఆటంకాలు తొల‌గిపోతాయి. అన‌వ‌స‌ర విష‌యాల్లో త‌ల దూర్చ‌కండి. క‌ల‌హాల‌కు దూరంగా ఉండాలి.

మీనం

ఈ రాశివారు కీల‌క వ్య‌వ‌హారాల్లో ఆచితూచి వ్య‌వ‌హరించాలి. ఒక శుభ‌వార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. కీల‌క నిర్ణ‌యాల్లో చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఒక మెట్టు త‌గ్గి మాట్లాడితే స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డుతాయి. ఒక సంఘ‌ట‌న బాధ క‌లిగిస్తుంది. ముఖ్య వ్య‌వ‌హారంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న ప‌నుల‌ను అనుకున్న‌ట్టు చేయడానికి బాగా శ్ర‌మించాల్సి వ‌స్తోంది.