చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేషం
మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. జీర్ణ సంబంధిత అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. మానసికంగా ఆందోళనతో ఉంటారు. ఖర్చులు అదుపు తప్పుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు గ్రహ సంచారం అద్భుతంగా ఉంది. ఈ రోజు ఈ రాశి వారిని అదృష్టం వరిస్తుంది. మీ అదృష్టం ఈ రోజు మిమ్మల్ని మీకే కొత్తగా పరిచయం చేస్తుంది. నమ్మశక్యం కానీ అదృష్టాన్ని అందుకోబోతున్నారు.
మిథునం
మిధునరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారు ఈ రోజు ప్రతి పనిలోనూ అప్రమత్తంగా ఉండడం అవసరం. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే ఆరోగ్య సంబంధమైన సమస్యలు, ఒత్తిడి, అపార్థాలూ, కుటుంబ సభ్యులతోనూ, స్నేహితులతోనూ, అనవసరమైన వివాదాలు రావచ్చు.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సంబంధమైన లబ్ధి, ఆదాయ వృద్ధి ఉంటాయి. కొత్తగా పెట్టుబడులను సమకూర్చుకోడానికి అనుకూలమైన రోజు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు అదృష్టకరంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం, దృఢ నిశ్చయంతో మీ మీరు చేసే అన్ని పనులూ సకాలంలో విజయవంతంగా పూర్తవుతాయి. మీ ధైర్యమే మీ బలం. అదే ఈ రోజు మీకు విశేషమైన గుర్తింపు తీసుకు వస్తుంది. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు జాతకపరంగా ఒక్క ప్రతికూలత కూడా లేదు. మీ రోజును దైవ ప్రార్ధనతో మొదలు పెడితే రోజంతా మంచే జరుగుతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి అందిన శుభ సమాచారం మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది.
తుల
తులారాశి వారికి కాలం కలిసిరాదు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం సరికాదు. సన్నిహితులతో ముందు కఠినంగా మాట్లాడి తర్వాత బాధపడినా ప్రయోజనం ఉండదు జాగ్రత్త. కోపం వల్ల ఏ సమస్యలూ తీరవు. జాగ్రత్తగా మాట్లాడాలి. ఆర్ధిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉంటే మేలు.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. బాధ్యతలు, తీరిక లేని పనుల నుంచి విశ్రాంతి తీసుకోండి. స్నేహితులతో సరదాగా, సంతోషంగా గడపండి. విందు వినోదాల్లో పాల్గొనండి. ఆర్ధిక పరమైన ప్రయోజనాలు ఉంటాయి.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, సంతోషం, అదృష్టం ఇలా అన్నీ ఒక్కసారిగా కలిసి వస్తాయి. రోజంతా చురుగ్గా వ్యవహరిస్తారు. ఉద్యోగస్థులకు సహోద్యోగుల నుంచి సహకారం ఉంటుంది. ఆర్థిక లాభం సూచితం.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గతం తాలూకు చెడు ప్రభావాలు ఇంకా తొలగిపోలేదు. మానసికంగా అస్థిరంగా ఉంటారు. మిమ్మల్ని కలిచి వేసే బాధకు కారణం మీకే తెలియక పోవచ్చు. వ్యాపారస్థులకు ఆర్ధిక నష్టం సూచితం.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు నష్టాలను తీసుకు వస్తాయి. మానసిక ప్రశాంతత ఉండదు. చేసే పనిలో స్పష్టత లేనందున పనులు ఆలస్యం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సానుకూల ఆలోచనలతో సంతోషంగా ఉంటారు. ముఖ్యమైన వ్యహారాల్లో మీరు సూచించిన సలహాలను పాటించి అందరూ విజయాన్ని సాధిస్తారు. దీనితో ఒక్కసారిగా మీ కీర్తి పెరుగుతుంది. పెట్టుబడుల రూపంలో ధనప్రవాహం ఉంటుంది.