Horoscope | గురువారం రాశిఫలాలు.. మీ రాశిఫలం ఎలా ఉందంటే..?
Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం
మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో వృత్తిలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగంలో హోదా పెరగవచ్చు. ఆర్థిక స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు రుణభారం పెరగవచ్చు. లాభాలు ఆశించిన మేరకు ఉండకపోవచ్చు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో విజయ పరంపర కొనసాగుతుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉత్తమమైన పనితీరుతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా శుభయోగాలున్నాయి.
మిథునం
మిథునరాశి వారికి మీరు ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. కొత్త పనులు, ఒప్పందాలు చేసుకోడానికి శుభ సమయం. స్థిరమైన బుద్ధితో తీసుకునే కీలక నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ధనలాభం ఉంది.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తలపెట్టిన పనుల్లో సమస్యలు ఎదురవుతాయి. ఇంటా బయటా శ్రమ పెరగకుండా చూసుకోండి. మానసిక ప్రశాంతతకు భంగం కలగవచ్చు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. పొదుపు చర్యలు చేపట్టడం అవసరం. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. భవిష్యత్ పట్ల స్పష్టమైన వైఖరితో ఉంటారు. బంధు మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆదాయం పెరుగుతుంది. పితృ సంబంధమైన ఆస్తి వ్యవహారాల్లో లబ్ధి పొందుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సమాచార లోపంతో వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఉండవచ్చు. మనోబలం తగ్గకుండా చూసుకోండి. కుటుంబ వ్యవహారాల్లో వాదప్రతివాదనలకు దూరంగా ఉండండి. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆదాయానికి తగ్గట్లు ఖర్చులు ఉంటాయి.
తుల
తులారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఆర్థికాభివృద్ధి కలదు. అన్ని రంగాల వారికి అదృష్టం కలిసి వచ్చే రోజు. ఏ రంగంలోనైనా విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకి విపరీతమైన లాభాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు, కాంట్రాక్టులు చేపట్టడానికి మంచిరోజు. చేపట్టిన పనుల్లో సత్వర విజయం ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు ఉండవచ్చు. కుటుంబంలో శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి. జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి, ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తిలో ఎదగడానికి చేసే ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వాదనలకు దూరంగా ఉండండి.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది . అస్థిర బుద్ధితో తీసుకునే నిర్ణయాలతో ఇబ్బందులు తలెత్తుతాయి. ఖర్చులు అదుపు తప్పకుండా జాగ్రత్త పడండి. వ్యాపారంలో ఆర్థికపరంగా నష్టాలు సంభవిస్తాయి. షేర్ మార్కెట్లో భారీ నష్టాలూ ఉండవచ్చు. అవమానకర పరిస్థితులకు దూరంగా ఉండండి.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం కోసం పనిచేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో తోటివారి సహాయ సహకారాలు ఉంటాయి. ఆర్థిక వృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కీలక వ్యవహారంలో బుద్ధిబలంతో పనిచేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. మొహమాటానికి పోయి చిక్కుల్లో పడే ప్రమాదముంది. ప్రతి విషయాన్నీ కుటుంబంతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.