Horoscope | ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో మధుర క్షణాలు..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. చక్కని ప్రణాళికతో ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. ముందుచూపుతో ఆర్థిక సమస్యలు తొలగుతాయి. బంధు మిత్రులతో సరదాగా గడుపుతారు. మానసిక ఆనందం కలిగించే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరుగుతుంది. జీవిత భాగస్వామితో మధుర క్షణాలు గడుపుతారు.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మీ జీవితం ఈ రోజు కొత్త మలుపు తిరుగుతుంది. సరికొత్త ఆలోచన విధానంతో విజయపథంలో దూసుకెళ్తారు. మీ ప్రతిభకు గుర్తింపు, ప్రశంసలు దక్కుతాయి. ఆర్థిక వ్యహారాలు తెలివిగా నిర్వహించి ఊహించని లాభాలు పొందుతారు. ఒక శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త ఈ రోజు అందుకుంటారు. కోపావేశాలు అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారంలో పోటీ తత్వంతో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశజనకంగా ఉండవచ్చు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఉత్సాహంగా పనిచేస్తే అనుకూల ఫలితాలు పొందవచ్చు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. కుటుంబ వ్యవహారాల్లో సమన్వయం పాటించాలి.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక వనరుల పెరుగుదలకు అవకాశం ఉంది. కుటుంబంలో చిన్న చిన్న ఘర్షణలు ఉండవచ్చు. జీవిత భాగస్వామితో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించండి. ప్రయాణాల్లో ప్రమాదాలు ఉండవచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండండి.
కన్య (Virgo)
కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. వృత్తికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఐశ్వర్యయోగం బలంగా ఉంది. భూ, గృహ వాహన యోగాలున్నాయి. కుటుంబంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి పరమైన శుభవార్తలు ఉత్సాహం కలిగిస్తాయి. ఆర్థికాభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారంలో విశేషమైన లాభాలు ఉంటాయి. ఉద్యోగులు పదోన్నతులు అందుకుంటారు. అధికారులు మీకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారులు ఈ రోజు మంచి లాభాలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. కుటుంబంతో, స్నేహితులతో ఆహ్లాదకరంగా గడుపుతారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి జీవితానికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సమతూకం పాటించడం చాలా ముఖ్యం. లక్ష్య సాధనలో స్వల్ప ఆటంకాలు ఉండవచ్చు. ఉద్యోగులు, వృత్తి నిపుణులు నైపుణ్యాలు మెరుగు పరచుకోవడంపై దృష్టి సారించాలి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ వాక్చాతుర్యంతో కీలక సమావేశాల్లో అందరినీ ఆకర్షిస్తారు. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ పరిస్థితులు ప్రశాంతంగా, ఉల్లాసభరితంగా ఉంటాయి. సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. అనేక మార్గాల నుంచి ఆర్థిక లాభాలు ఆనందం కలిగిస్తాయి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో చిత్తశుద్ధి ఏకాగ్రతతో పనిచేసి అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక పరమైన శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి. దైవబలం అండగా ఉంటుంది. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు పదోన్నతులు అందుకుంటారు. అధికారుల నుంచి అందుకున్న ప్రశంసలు ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తాయి. దూరప్రాంతాల నుంచి అందిన ఒక శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. వృత్తిపరంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram