28.07.2024 ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి విశేష‌మైన ఆర్థిక ప్ర‌యోజ‌నాలు..!

Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

28.07.2024 ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి విశేష‌మైన ఆర్థిక ప్ర‌యోజ‌నాలు..!

మేషం

మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. తమ తమ రంగాలలో తొందరపాటు ధోరణితో ఉండడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు ఆచి తూచి వ్యవహరిస్తే మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది.

వృషభం

మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందడుగు వేస్తేనే విజయం లభిస్తుంది. ఆర్ధిక లావాదేవీలు నిర్వహించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని తగ్గించుకొని నిగ్రహం పాటించాలి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ రోజు విశేషమైన ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపార విస్తరణ కోసం విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెట్టుబడులు లభిస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు.

కర్కాటకం

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల అవసరాల పట్ల శ్రద్ధ వహిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారంలో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిర్దేశించుకున్న లక్ష్యం దిశగా మీ ప్రయాణం ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. విదేశాల్లో నివసించే బంధువుల నించి అందిన వార్తల వలన మనస్తాపం కలుగుతుంది. ఆర్ధిక నష్టాలు సంభవించవచ్చు.

కన్య

ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మీ వ్యక్తిత్వాన్నిప్రతిబింబించేలా మీ చర్యలు ఉంటాయి కాబట్టి ముఖ్యులతో ఆచి తూచి వ్యవహరించండి. ప్రియమైన వారి కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు.

తుల

తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. అదృష్టం అవకాశాల రూపంలో ఎదురవుతాయి. వృత్తి వ్యాపార రంగాల వారికి ఆశించిన దానికన్నా గొప్ప విజయాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం ఎలాంటి సమస్యలు లేకుండా సానుకూలంగా ఉంటుంది. మీరు శారీరకంగా, మానసికంగా శక్తివంతంగా ఉంటారు. మీ పోటీదారులు తమ ఓటమిని అంగీకరిస్తారు.పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఆర్ధిక లాభాలు పొందడానికి అవకాశం ఉంది.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా లేనందున అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో సమస్యలు, ఆటంకాలు ఎదురవుతాయి. తీవ్రమైన అనారోగ్య సమస్యల కారణంగా చికాకుతో ఉంటారు. వ్యాపారస్తులు వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు ప్రతికూలంగా ఉంటుంది. భారీస్థాయిలో నష్టాలు ఉంటాయి. ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్ళను ఆత్మ విశ్వాసంతో అధిగమిస్తారు. కుటుంబ సమస్యలతో ఆందోళనగా ఉంటారు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.

కుంభం

కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. ఆత్మవిశ్వాసం లోపించడం వల్ల గందరగోళానికి గురవుతారు. సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొనడంలోనూ ఇబ్బందిపడతారు. వృత్తి వ్యాపార రంగాల వారికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ప్రతికూల ఆలోచనలకు, వివాదాలకు దూరంగా ఉండండి.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి పనిభారం పెరుగుతుంది. వ్యాపారంలో అనుకోని సవాళ్లు ఎదురుకావడంతో ఒత్తిడికి లోనవుతారు. మీ పరుషమైన మాటలతో సన్నిహితులను ఇబ్బంది పెడతారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆదాయానికి తగ్గట్లు ఖర్చులు ఉంటాయి.