Sharad Purnima | రేపే శరత్ పౌర్ణమి.. ఇవి దానం చేస్తే ఏడాదంతా డబ్బుకు లోటు ఉండదట..!
Sharad Purnima | ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం( Ashvayuja Masam )లో వచ్చే శుక్లపక్ష పౌర్ణమిని శరత్ పూర్ణిమ( Sharad Purnima )గా పరిగణిస్తారు. శరత్ పూర్ణిమను హిందువులు( Hindus ) ఉత్సాహంగా జరుపుకుంటారు.

Sharad Purnima | ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం( Ashvayuja Masam )లో వచ్చే శుక్లపక్ష పౌర్ణమిని శరత్ పూర్ణిమ( Sharad Purnima )గా పరిగణిస్తారు. శరత్ పూర్ణిమను హిందువులు( Hindus ) ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీకృష్ణుడు, రాధలతో పాటు శివపార్వతులను భక్తులు పూజిస్తారు. చంద్రుడిని కూడా పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజున భక్తులు చేసే పూజకు, దానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శరత్ పూర్ణిమ రోజున దానధర్మాలు చేయడం వల్ల లక్ష్మీదేవి( Lakshmi Devi ) అనుగ్రహం పొంది ఏడాదంతా డబ్బుకు లోటు ఉండదట. దురదృష్టం పోయి అదృష్టం కలిసి వస్తుందట.
శరత్ పూర్ణిమ ఎప్పుడు..?
పంచాంగం ప్రకారం ఆశ్వీయుజ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తిథి అక్టోబర్ 16 బుధవారం రాత్రి 08:41 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు అంటే గురువారం అక్టోబర్ 17 సాయంత్రం 04:53 గంటలకు ముగుస్తుంది. అయితే శరత్ పూర్ణిమ పండుగను అక్టోబర్ 16న మాత్రమే జరుపుకుంటారు. ఈ రోజు సాయంత్రం 05:04 గంటలకు చంద్రోదయం జరుగుతుంది.
అన్నవితరణ చేస్తే.. ఇంట్లో సంపద పెరుగుతుందట..!
శరత్ పూర్ణిమ రోజున అన్న వితరణ చేయడం మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అన్నం సంతర్పణ చేయడం వల్ల లక్ష్మీ దేవిని ప్రసన్నం అవుతుందని ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం. బియ్యం శ్రేయస్సు, సంపదలకు చిహ్నంగా పరిగణించబడుతుంది. శరత్ పూర్ణిమ రోజున అన్నవితరణ చేయడం వల్ల లక్ష్మీ దేవి ప్రసన్నురాలై ఇంట్లో సంపద పెరుగుతుంది. అంతే కాదు, శరత్ పూర్ణిమ రోజున అన్నవితరణ చేయడం వల్ల మనిషి జీవితంలోని సమస్యలు తొలగిపోయి మంచి ఫలితాలు లభిస్తాయి.
ఇంకా ఏం దానం చేయొచ్చు..!
- పాలు దానం చేయడం కారణంగా ధన లాభం కలుగుతుందట. ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా లభిస్తుందట.
- గంధాన్ని దానం చేయడం ద్వారా ఆ ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయట. సంపదల దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
- పేదవారికి వస్త్రదానం చేయడం వల్ల పుణ్యం, ధనలాభం కలుగుతాయి.
- పండ్లు దేవతలకు ప్రీతికరమైనవి. పండ్లను దానం చేయడం ద్వారా సకల దేవతల అనుగ్రహం పొంది ఐశ్వర్యాన్ని పొందుతాడు.
- బెల్లం శ్రేయస్సు, ఆనందానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. దీన్ని దానం చేయడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది. బెల్లం దానం చేయడం వల్ల పితృ దోషాలు తొలగిపోయి పూర్వీకుల అనుగ్రహం లభిస్తుంది.