బీపీ, షుగ‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారా..? శివుడిని ఇలా పూజిస్తే అన్నీ మాయం..!

బీపీ, షుగ‌ర్, మోకాళ్ల నొప్పుల‌తో పాటు దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు సోమ‌వారం రోజు శివుడిని భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజిస్తే త‌ప్ప‌కుండా స్వ‌స్థ‌త ల‌భిస్తుంద‌నేది భ‌క్తుల విశ్వాసం. మ‌రి అందుకోసం సోమ‌వారం ఎలా పూజ చేయాలో తెలుసుకుందాం.

బీపీ, షుగ‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారా..? శివుడిని ఇలా పూజిస్తే అన్నీ మాయం..!

హిందూ సంప్ర‌దాయం ప్రకారం.. శివారాధన‌కు సోమ‌వారం ఎంతో విశిష్ట‌మైన‌ది. ప్ర‌తి సోమ‌వారం భ‌క్తులు శివాల‌యాల‌కు వెళ్తుంటారు. అభిషేకాలు చేస్తుంటారు. ఆల‌యాల‌కు వెళ్ల‌లేని వారు ఇంట్లోనే శివ‌య్య‌ను భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజిస్తారు. ఎందుకంటే మిగిలిన రోజుల క‌న్నా సోమ‌వారం ఆ నీల‌కంఠేశ్వ‌రుడిని ఆరాధిస్తే శివానుగ్ర‌హం ల‌భిస్తుంద‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. అయితే బీపీ, షుగ‌ర్, మోకాళ్ల నొప్పుల‌తో పాటు దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు సోమ‌వారం రోజు శివుడిని భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజిస్తే త‌ప్ప‌కుండా స్వ‌స్థ‌త ల‌భిస్తుంద‌నేది భ‌క్తుల విశ్వాసం. మ‌రి అందుకోసం సోమ‌వారం ఎలా పూజ చేయాలో తెలుసుకుందాం.

బీపీ, షుగ‌ర్‌, మోకాళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డేవారు మెడిసిన్స్ వాడుతుంటారు. అయిన‌ప్ప‌టికీ చాలా మందికి ఫ‌లితం ఉండ‌దు. అలాంటి వారు సోమ‌వారం నాడు మృత్యుంజ‌యుడైన శివ‌య్య‌ను భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజిస్తే త‌ప్ప‌కుండా స్వ‌స్థ‌త చేకూరుతుంద‌ని పండితులు చెబుతున్నారు. సోమవారం రోజు ఆవు పాలు, నల్ల నువ్వులు శివయ్యకు సమర్పించాలి. అనంతరం మృత్యుంజయ మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఇలా 11 సోమవారాలు చేస్తే శివయ్య అనుగ్రహంతో అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.

శ‌ని దోషాల‌తో ఇబ్బంది ప‌డేవారు కూడా సోమ‌వారం శివ‌య్య‌ను భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజిస్తే త‌ప్ప‌కుండా ఫ‌లితం ఉంటుంది. జాతకంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని దోషాలు ఉన్నట్లయితే సోమవారం రోజు రాగి పాత్రలో గంగాజలం తీసుకొని రుద్ర మంత్ర సహితంగా శివునికి అభిషేకం చేస్తే శని దోషాల వలన కలిగే బాధలకు ఉపశమనం కలుగుతుంది. ఇలా 11 సోమవారాలు నియమనిష్టలతో చేస్తే సత్వర ఫలితం ఉంటుంది. అభిషేకం చేసే శివలింగం రావిచెట్టు కింద ఉన్నట్లయితే మరింత శ్రేష్టం.

అయితే శివయ్య పూజలో చిత్తశుద్ధి ఎంతో ముఖ్యం. ఏదో ఒకలాగా మొక్కుబడిగా పూజ పూర్తి చేసి ఫలితాల కోసం ఎదురు చూడటం శుద్ధ దండగ. మనసా వాచా కర్మణా చిత్తశుద్ధితో పూజించిన వారికే సత్వర ఫలితాలు ఉంటాయి. శివుని పూజలో మనం సమర్పించాల్సిన ముఖ్యమైనది భక్తితో కూడిన మనసు. అందుకే అంటారు కదా ‘చిత్తశుద్ధిలేని శివ పూజలేలరా’ అని!. కాబట్టి మనం ఎంత ఘనంగా పూజ చేస్తున్నాం అన్నది ముఖ్యం కాదు ఎంత భక్తితో చేస్తున్నాం అనేది ముఖ్యం. కేవలం భక్తికి మాత్రమే పరవశించే భక్తవశంకరుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుందాం.