ఆర్థిక క‌ష్టాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారా..? శుక్ర‌వారం ల‌క్ష్మీదేవిని ఇలా పూజించండి..!

శుక్ర‌వారం రోజున పొద్దున ఉద‌యం 9 నుంచి 10 గంట‌ల మ‌ధ్య ల‌క్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక క‌ష్టాలు తొల‌గిపోతాయ‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. శుక్ర‌వారం ల‌క్ష్మీదేవికి ఇష్ట‌మైన రోజు కాబ‌ట్టి.. ఉప‌వాసం ఉండి పూజ చేస్తే ఇంకా మంచిది. శుక్ర‌వారం ఇలా పూజ చేశారంటే ఆర్థిక క‌ష్టాలు తొల‌గిపోయి.. ఐశ్వ‌ర్యం ప్రాప్తిస్తుంది.

ఆర్థిక క‌ష్టాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారా..? శుక్ర‌వారం ల‌క్ష్మీదేవిని ఇలా పూజించండి..!

ప్ర‌తి ఒక్క‌రూ డ‌బ్బు సంపాద‌న కోసం చాలా క‌ష్ట‌ప‌డుతుంటారు. కానీ డ‌బ్బు మాత్రం నిల్వ ఉండ‌దు. ఎంత క‌ష్ట‌ప‌డి సంపాదించినా.. ఆర్థిక క‌ష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి వారు శుక్ర‌వారం రోజున పొద్దున ఉద‌యం 9 నుంచి 10 గంట‌ల మ‌ధ్య ల‌క్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక క‌ష్టాలు తొల‌గిపోతాయ‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. శుక్ర‌వారం ల‌క్ష్మీదేవికి ఇష్ట‌మైన రోజు కాబ‌ట్టి.. ఉప‌వాసం ఉండి పూజ చేస్తే ఇంకా మంచిది. శుక్ర‌వారం ఇలా పూజ చేశారంటే ఆర్థిక క‌ష్టాలు తొల‌గిపోయి.. ఐశ్వ‌ర్యం ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా ఆ ఇంట్లో సుఖ‌సంతోషాలు కూడా వెల్లివిరుస్తాయి.

మందార పువ్వుతో పూజించండి..

ల‌క్ష్మీదేవికి మందార పువ్వు ఎంతో ఇష్టం. కాబ‌ట్టి ల‌క్ష్మీదేవిని పూజించే స‌మ‌యంలో మందార పువ్వును త‌ప్ప‌నిస‌రిగా అమ్మ‌వారికి స‌మ‌ర్పించాలి. మందార పువ్వుతో పూజ చేయ‌డం వ‌ల్ల ఆర్థిక క‌ష్టాలు తొల‌గిపోయి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఆర్థిక సమస్యలు ఎదుర్కొనేందుకు పూజలో ఉంచిన పూలు మీ పర్సులో కూడా పెట్టుకోవచ్చు. ఎర్రని రంగు పువ్వులు అమ్మవారికి సమార్పిస్తే కోరికలు నెరవేరుస్తుందని నమ్ముతారు.

నెయ్యితో దీపం

పూజా కార్య‌క్ర‌మాల్లో భాగంగా స్వచ్చమైన నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల శ్రేయస్సు, ఆరోగ్యం, ఆనందం పొందుతారు. నెయ్యి లేదా నువ్వుల నూనెతో పదకొండు దీపాలు వెలిగించాలి. ఇలా చేస్తే అమ్మవారు అనుగ్రహించి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం పొందటం కోసం అద్భుతమైన సువాసన వెదజల్లే గంధం సమర్పించాలి. దీన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల అదృష్టం వరిస్తుంది.

ఈ వస్తువులు దానం చేయాలి

పవిత్రమైన శుక్రవారం రోజు లక్ష్మీ దేవి అనుగ్రహం పొందటం కోసం ఖీర్ తయారు చేసి ప్రసాదంగా పంచిపెడితే మంచిది. 21 శుక్రవారాలు ఎటువంటి ఆటంకం లేకుండా ఇలా పరిహారం చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయట పడటం మాత్రమే కాదు మీ కోరికలు నెరవేరుతాయి. ఆవుకు గడ్డి, బెల్లం తినిపించడం వల్ల మేలు జరుగుతుంది. ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి కరుణిస్తుంది.