శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు

విధాత‌: శ్రీశైల మహాక్షేత్రంలో నవంబర్‌ 5 నుంచి డిసెంబర్‌ 4 వరకు కార్తిక మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు శ్రీశైలం ఈవో ఎస్‌. లవన్న తెలిపారు. ఈ మేరకు కార్తిక మాసంలో వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ మాసంలో స్వామివారి స్పర్శ దర్శనంతో పాటు రూ.5 వేల గర్భాలయ అభిషేకం నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. కొవిడ్ నిబంధనల మేరకు ఆలయ నిర్వాహకులకు భక్తులు సహకరించాలని కోరారు.