Sesame oil | మీ జాతకంలో ఈ గ్రహ దోషాలున్నాయా..? అయితే ఈ నూనెతో దీపం వెలిగించండి..!
Sesame oil | ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. వాటిని అధిగమించిన వారే జీవితంలో ఎదుగుతారు. అయితే కొందరిని గ్రహ దోషాలు వెంటాడుతూనే ఉంటాయి. ఈ గ్రహ దోషాల వల్ల జీవితంలో ముందుకు వెళ్లలేకపోతారు. అలాంటి వారు ఈ నూనెతో దీపారాధన చేస్తే అన్నీ శుభాలే కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Sesame oil | హిందూ సంప్రదాయంలో ప్రతి రోజు ఏదో ఒక దేవుడి( God )కి పూజలు చేస్తూనే ఉంటాయి. పూజ( Puja ) సమయంలో దీపారాధనకు నువ్వుల నూనె( Sesame oil ), ఆవు నెయ్యి( Cow Ghee ), ఆవ నూనె( Mustard oil ) వంటి వాటిని ఉపయోగిస్తుంటారు. వీటిలో నువ్వుల నూనె అత్యంత పవిత్రమైనది అని పండితులు చెబుతున్నారు. నువ్వుల నూనెతో దీపం వెలిగించడం కారణంగా పర్యావరణం కూడా శుద్ధి అవుతుందట. ఆ ఇంట్లో ఉన్న వ్యక్తుల్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయట. గ్రహదోషాలు తొలగిపోయి అన్నీ శుభాలే కలుగుతాయని పండితుల నమ్మకం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నువ్వుల నూనెతో దీపం వెలిగించడం కారణంగా మనసు ప్రశాంతమవుతుంది. ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది. ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల శని దోషం, రాహు-కేతు దోషాలు మొదలైన గ్రహ దోషాలు తొలగిపోతాయి. నువ్వుల నూనెను దేవతలకు నైవేద్యంగా సమర్పించడం ద్వారా వారు ప్రసన్నులై భక్తులపై తమ దీవెనలు కురిపిస్తారు.
నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడం వలన జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది. అంతేకాదు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో పురోగతికి అవకాశాలను సృష్టిస్తుంది. జాతకంలో చంద్రుని స్థానాన్ని బలపరుస్తుంది. గ్రహ దోషాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. అంతేకాదు ఈ నువ్వుల నూనె ప్రత్యేక ప్రాముఖ్యత శనిశ్వరుడికి జోడించబడింది. శనిశ్వరుని కోపాన్ని శాంతపరచడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుందని నమ్ముతారు.