Skanda Shashti Vratam | సంతానం కోసం స్కంద షష్టి వ్రతం..! ఎప్పుడు చేయాలో తెలుసా..?
Skanda Shashti Vratam | సంతానం( Childrens ) కోసం పరితపించే దంపతులకు( Couples ) స్కంద షష్టి వ్రతం( Skanda Shashti Vratam ) ఒక గొప్ప వరం లాంటింది. ప్రతి నెల శుక్లపక్షం షష్టి తిథి రోజున స్కంద షష్టి వ్రతం చేస్తే ఆ దంపతులకు తప్పకుండా సంతానం కోరిక నెరవేరుతుందట. ఈ నెలలో అక్టోబర్ 8, 9 తేదీల్లో శుక్లపక్ష షష్టితి వచ్చింది. మరి ఆలస్యం ఎందుకు.. స్కంద షష్టి వ్రతానికి సిద్ధం కండి.

Skanda Shashti Vratam | ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం( Ashwayuja Masam )లోని శుక్లపక్ష షష్టి తిథి రోజున ఎంతో ఉత్సాహంగా స్కంద షష్టి పండుగ( Skanda Shashti Vratam )ను జరుపుకుంటారు. శుక్ల పక్షం షష్టి తిథి రోజున శివపార్వతుల తనయుడు కార్తికేయుడి( Karthikeyudu )ని పూజిస్తారు. ఎందుకంటే ఈ తిథి కార్తికేయుడికి అంకితం చేయబడింది. ఈ తిథి రోజున పూజలు నిర్వహించి, భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ఇక సంతానం( Childrens ) కలగని దంపతులు( Couples ) ఈ రోజున స్కంద షష్టి వత్రం చేస్తే తప్పకుండా పిల్లలు జన్మిస్తారని నమ్మకం. అంతేకాకుండా జీవితంలో కష్టాలు కూడా తొలగిపోయి.. సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని పండితులు చెబుతున్నారు.
స్కంద షష్టి తిథి ఎప్పుడంటే..?
హిందూ పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్ష షష్ఠి తిథి అక్టోబర్ 8, మంగళవారం ఉదయం 11:17 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 9, బుధవారం మధ్యాహ్నం 12:34 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో స్కంద షష్టి వత్రం చేయాలి. వ్రతం చేసే వారు ఉపవాస దీక్ష చేస్తే ఇంకా మంచిది. అయితే తిథి ప్రకారం స్కంద షష్ఠి ఉపవాసం అక్టోబర్ 9 వ తేదీన మాత్రమే ఆచరించాల్సి ఉంటుంది. షష్టి ఉపవాసం మరుసటి రోజు అంటే అక్టోబర్ 10వ తేదీన విరమించాల్సి ఉంటుంది.
స్కంద షష్టి వ్రత విధానం..
స్కంద షష్టి రోజున పొద్దున్నే నిద్ర లేచి అభ్యంగస్నానం ఆచరించాలి. ఉతికిన బట్టలు ధరించాలి. ఇక పూజా మందిరాన్ని శుభ్రం చేసి, కార్తికేయ విగ్రహాన్ని ప్రతిష్టించాలి. విగ్రహాన్ని పూలతో అలంకరించి.. దీపం వెలిగించి, ధూపం వేయాలి. ఆ తర్వాత కార్తికేయుడికి నైవేద్యం సమర్పించాలి. పూజా సమయంలో కార్తికేయుడిని ధ్యానిస్తూ మంత్రాలను జపించండి. కార్తికేయుడిని పూజించిన తర్వాత.. కార్తికేయుని జన్మ రహస్యం కథను వినండి లేదా చదవండి. పూజ ముగిసిన అనంతరం బ్రాహ్మణుడికి ఆహారాన్ని అందించండి. అంతేకాదు పేదలకు శక్తి మేరకు దానం చేయండి.
ఉపవాస విధానం..
ఈ రోజున స్త్రీలు సంతాన ప్రాప్తి కోసం , తమ పిల్లల దీర్ఘాయువు కోసం ఉపవాసాన్ని పాటిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కార్తికేయ భగవానుడితో పాటు శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. ఉపవాస సమయంలో సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. ఈ వ్రతాన్ని ఆచరించే వారు స్కంద షష్ఠి మర్నాడు ఆచారాల ప్రకారం, శుభ సమయంలో ఉపవాసాన్ని విరమించాల్సి ఉంటుది. ఇలా చేయడం ద్వారా ఉపవాసం విజయవంతం అవుతుంది. ఉపవాసం చేసిన పూర్తి ఫలితం పొందుతారు. జీవితంలో అన్ని సమస్యలు తొలగిపోతాయి.
జపించాల్సిన మంత్రం..
మంత్రం: దేవ సేనాపతే స్కంద కార్తికేయ భవోద్భవ| కుమార గ్రుహ్ గాంగేయ శక్తి హస్తా నమోస్తు తే ।(देव सेनापते स्कंद कार्तिकेय भवोद्भव। कुमार गुह गांगेय शक्तिहस्त नमोस्तु ते॥)