విధాత : గడిచిన వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండ డంతో తిరుమల, తిరుపతి తడిసి ముద్దవుతున్నాయి. అంతటా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తోన్నాయి. అక్కడక్కడా కొండచరియలు కూడా విరిగి పడుతున్నాయి. ఈ క్రమంలో టీటీడీ రెండు మెట్ల మార్గాలను బుధవారం నుంచి నిలిపివేశారు. కాగా గురువారం ఉదయం నుంచి ఆగకుండా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. ఉన్న పలంగా తిరుమలలో భారీ వర్షం కురియడంతో కొంతమంది భక్తులు రోడ్డు పక్కనే ఉన్న ఓ షెల్టర్ […]
విధాత : గడిచిన వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండ డంతో తిరుమల, తిరుపతి తడిసి ముద్దవుతున్నాయి. అంతటా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తోన్నాయి. అక్కడక్కడా కొండచరియలు కూడా విరిగి పడుతున్నాయి.
ఈ క్రమంలో టీటీడీ రెండు మెట్ల మార్గాలను బుధవారం నుంచి నిలిపివేశారు. కాగా గురువారం ఉదయం నుంచి ఆగకుండా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. ఉన్న పలంగా తిరుమలలో భారీ వర్షం కురియడంతో కొంతమంది భక్తులు రోడ్డు పక్కనే ఉన్న ఓ షెల్టర్ లో తలదాచుకున్నారు.
ఐతే అదే సమయంలో రోడ్డు పై కాలువ లాగా వరద పారడంతో ఓ వ్యక్తి అందులో కొట్టుకుపోవడం గమనించారు. రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ కుదరకపోవడంతో ఆ వ్యక్తి కిందకు అలానే కొట్టుకుపోయాడు… అతనికి ఏమైనా ప్రమాదం జరిగిందా లేదా అనేది తెలియాల్సి ఉంది.