26 మే నుంచి జూన్ 1వ తేదీ వ‌ర‌కు.. ఈ వారం మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. త‌మ రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. రాశి ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

26 మే నుంచి జూన్ 1వ తేదీ వ‌ర‌కు.. ఈ వారం మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

మేషం

మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీ లక్ష్య శుద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తారు. ప్రభుత్వ పరంగా ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగులు సహోద్యోగుల సహకారం అందుకుంటారు. మెరుగైన ఆదాయ వనరులను కలిగి ఉంటారు. అన్ని రంగాల వారు తమ వృత్తి వ్యాపారాలలో ఎదగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మిత్రుల సహాయంతో లాభదాయకమైన ప్రణాళికను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. కుటుంబ సభ్యులతో దేశవిదేశాలలో పర్యటిస్తారు. సంతానం అభివృద్హికి సంబంధించి శుభవార్తలు వింటారు. మీ పిల్లల ఉన్నతి సమాజంలో మీకు మరింత గౌరవాన్ని ఇస్తుంది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది.

వృషభం

వృషభరాశి వారికి ఈ వారం అన్నివిధాలా పురోగతి ఉంటుంది. లక్ష్య సాధనలో ఆరోగ్య సమస్యలు ఆటంకం కలిగించవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రభుత్వానికి సంబంధించిన పనులు వారం చివరిలోగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు కృషికి తగిన ఫలితం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి ఉంటుంది. వృత్తి నిపుణులు, వ్యాపారస్తులు వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి ఈ వారం అద్భుతమైన అవకాశం ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ సన్నిహితులతో పాటు, మీ కుటుంబ సభ్యుల సలహా కూడా తీసుకుంటే మంచిది.

మిథునం

మిథున రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు శుభ సమయం నడుస్తోంది. గొప్ప శుభవార్తలను వింటారు. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి శుభ సమయం. మీరు కోరుకున్నఆర్ధిక ప్రయోజనాలను పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి, మార్కెటింగ్, కమీషన్లు రంగం వారికి అదృష్ట దాయకంగా ఉంటుంది. ఈ వారంలో బంధుమిత్రుల ఇంట్లో శుభ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. వ్యాపారస్తులు సంస్థ అభివృద్ధి కోసం పాటుపడతారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉండవచ్చు. ఇంటి మరమ్మతుల కోసం ధనవ్యయం ఉంటుంది. ఆర్ధిక సమస్యలు ఉండవచ్చు. ఉద్యోగులకు తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుంది. మీ పై అధికారులు మీ పనితీరు పట్ల అసంతృప్తితో ఉంటారు. నైపుణ్యాలు మెరుగుపరచుకోకుంటే నిందలు పడాల్సి వస్తుంది. వ్యాపారులు భాగస్వాములతో సమయానుకూలంగా మాట్లాడుతూ సంయమనం పాటించడం అవసరం. సమష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. వాహనగండం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉంటే మేలు.

సింహం

సింహ రాశి వారికి ఈ వారం శుభకరంగా ఉంటుంది. మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సామాజిక, మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఎన్నో రోజుల నుంచి వేధిస్తున్న కుటుంబ సమస్యలను పరిష్కరించడంలో మీరు విజయం సాధిస్తారు. అన్ని రంగాల వారు ఈ వారం మంచి అదృష్టం, మెరుగైన ప్రయోజనాలు అందుకుంటారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులు బదిలీ, ప్రమోషన్‌ను అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

కన్య

కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు.ఆర్ధికంగా ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. పనులన్నీ సకాలంలో పూర్తి కావాలంటే తీవ్రమైన కృషి అవసరం. జీవిత భాగస్వామితో వివాదాలు ఏర్పడవచ్చు. వాదనలు తగ్గించి సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తే మేలు. తీర్ధయాత్రలు చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో కోపాన్ని అదుపులో ఉంచుకొని సహనంతో ఉండడం వలన కలహాలు రావు. ఉద్యోగస్తులు సహోద్యోగులతో మెరుగైన సమన్వయాన్ని కొనసాగించడం అవసరం. ఆరోగ్య పట్ల శ్రద్ధ అవసరం.

తుల

ఈ వారం తులా రాశి వారికి శుభకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో, కుటుంబ వ్యవహారాల్లో సర్వత్రా విజయం ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి. నూతన ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అదృష్ట సమయం నడుస్తోంది. తిరుగులేని విజయాలను సాధిస్తారు. బంధుమిత్రుల ఇళ్లల్లో జరిగే శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారులు వ్యాపార అభివృద్ధి కోసం కృషి చేస్తారు. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి శుభసమయం.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లాభాలకు ఆటంకాలు తొలగిపోతాయి. ఆరోగ్యం పట్ల అదనపు శ్రద్ధ వహించండి. గృహంలో శాంతి, సంతోషం నెలకొల్పడానికి కృషి చేస్తారు. స్థిరాస్తి రంగం వారు నూతన ప్రాజెక్టులు చేపడుతారు. తోబుట్టువుల సహకారంతో కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు పెద్దల సహకారంతో వృద్ధి చెందుతాయి. సంతానం పురోగతి పట్ల సంతృప్తిగా ఉంటారు. బంగారం వెండి వ్యాపారులకు నిరాశాజనకంగా ఉండవచ్చు.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులు అవకాశవాదులు పట్ల అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారస్తులు వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉండదు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి కావాలంటే అదనపు వనరులు అవసరం. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యంపై అదనపు శ్రద్ధ అవసరం.

మకరం

మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. భూవివాదాలలో కోర్టు తీర్పు మీకు అనుకూలంగా రావచ్చు. మిమ్మల్ని తప్పుదారి పట్టించేవారు మీ పక్కనే ఉంటారు. వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఉద్యోగులకు సహోద్యోగుల సంపూర్ణ సహకారం అందుతుంది. బదిలీ, పదోన్నతి కోసం ఎదురు చూసే వారికి సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

కుంభం

కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో జరిగే శుభకార్యాల్లో పాల్గొంటారు. రాజకీయ రంగంలోని వారు ముఖ్యమైన బాధ్యతలు చేపడతారు. వ్యాపారులు వ్యాపారంలో పురోగతి చూస్తారు. మంచి లాభాలను కూడా అందుకుంటారు. జీవిత భాగస్వాముల మధ్య పరస్పర అవగాహన విశ్వాసం పెరుగుతాయి. కుటుంబంలో సంతోషం నెలకొల్పడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగస్తులకు అదనపు ఆదాయ వనరులు సమకూరుతాయి.

మీనం

మీన రాశి వారికి ఈ వారం ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ద్యోగులు అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది. పని నుంచి కొంత విరామం తీసుకుని విశ్రాంతి తీసుకోండి. లక్ష్య సాధన పట్ల దృష్టి మరల్చకుండా జాగ్రత్త పడాలి. ప్రాధాన్యత లేని అంశాలను, ప్రతికూల ఆలోచనలను వీడితే మంచిది. వ్యాపారంలో పురోగతి లేక డబ్బు ఆగిపోవడం ఆందోళన కలిగిస్తుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారు భారీ నష్టాలను చవి చూస్తారు. ఇది మీ ఆర్థిక సమస్యలను మరింత దిగజార్చుతుంది.