FDDI | ఫుట్‌వేర్ రంగంలో రాణించాలనుకుంటున్నారా..? ఎఫ్‌డీడీఐ అందిస్తున్న కోర్సులివే..!
FDDI | ఫ్యాషన్ డిజైనింగ్ మాదిరిగానే ఫుట్‌వేర్ డిజైన్( Footwear Design ) కోర్సులు ఉన్నట్టు చాలా మందికి తెలియదు. ఈ ఫుట్‌వేర్ డిజైన్‌కు సంబంధించి దేశ వ్యాప్తంగా కొన్ని ప్రత్యేక ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. వీటిల్లో ఫుట్‌వేర్ డిజైన్‌కు సంబంధించి శిక్షణ ఇస్తుంటారు. మరి ఈ ఫుట్‌వేర్ డిజైన్ అంటే ఏమిటి..? ఎక్కడెక్కడ ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి..? అర్హతలు ఏంటి..? అనే విషయాలు తెలుసుకుందాం.

FDDI | ఫ్యాషన్ డిజైనింగ్( Fashion Designing ) కోర్సులు ఉన్నట్టు చాలా మందికి తెలుసు. ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులను చేయడం ద్వారా వ్యక్తిగతంగా ఉపాధి పొందొచ్చు. సందర్భాన్ని బట్టి పది మందికి కూడా ఉపాధి కల్పించొచ్చు. ఇలా అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తుంటాయి. ఫ్యాషన్ డిజైనింగ్ మాదిరిగానే ఫుట్‌వేర్ డిజైన్( Footwear Design ) కోర్సులు ఉన్నట్టు చాలా మందికి తెలియదు. ఈ ఫుట్‌వేర్ డిజైన్‌కు సంబంధించి దేశ వ్యాప్తంగా కొన్ని ప్రత్యేక ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. వీటిల్లో ఫుట్‌వేర్ డిజైన్‌కు సంబంధించి శిక్షణ ఇస్తుంటారు. మరి ఈ ఫుట్‌వేర్ డిజైన్ అంటే ఏమిటి..? ఎక్కడెక్కడ ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి..? అర్హతలు ఏంటి..? అనే విషయాలు తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరూ పాదరక్షలు ధరిస్తున్నారు. దాంతో పాటు లెదర్ యాక్ససరీస్, లైఫ్ స్టైల్ వస్తువులను కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇక ఎంతో ఆకర్షణీయంగా ఉండే పాదరక్షకలు, లెదర్ యాక్ససరీస్‌లను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. విక్రయాలు కూడా భారీగానే ఉన్నాయి. కాబట్టి రోజురోజుకు విస్తరిస్తున్న ఈ రంగంలో నిపుణుల కొరతను తీర్చేందుకు ఏర్పాటు చేసిన సంస్థనే ఎఫ్‌డీడీఐ( FDDI ). ఈ సంస్థ యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న 12 ఎఫ్‌డీడీఐల్లో ప్రవేశాల కోసం ఇటీవలే ప్రకటన విడుదలైంది.
అసలు ఎఫ్‌డీడీఐ అంటే ఏంటి..?
ఎఫ్‌డీడీఐ( FDDi ) అంటే.. ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్( Footwear Design and Development Institute ). ఈ సంస్థ పాదరక్షల తయారీ, తోలు ఉపకరణాలు, లైఫ్‌స్టైల్ ఉత్పత్తుల రంగాల్లో నైపుణ్య లోటును భర్తీ చేస్తుంది. ఈ రంగాల్లో ఆసక్తి గల అభ్యర్థులకు శిక్షణ ఇస్తుంది.
మరి ఎక్కడెక్కడ ఎఫ్‌డీడీఐ క్యాంపస్‌లు ఉన్నాయి..?
హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, నోయిడా, ప్రుస్త్‌గంజ్, రోహతక్, చింద్వారా, గుణ, జోధ్‌పూర్, అంకలేశ్వర్, బానూరు, పాట్నా. ఈ 12 క్యాంపస్‌లలో మొత్తం 2,390 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఎఫ్‌డీడీఐ ఆఫర్ చేస్తున్న యూజీ, పీజీ కోర్సులివే..
యూజీ కోర్సులు..
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్(బీ డిజైన్)
బీ డిజైన్ (ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్)
బీ డిజైన్ ( ఫ్యాషన్ డిజైన్ )
బీ డిజైన్ (లెదర్, లైఫ్‌స్టైల్ అండ్ ప్రొడక్ట్ డిజైన్)
బీబీఏ (రిటైల్ అండ్ ఫ్యాషనల్ మర్చండైజ్)
కాలపరిమితి : నాలుగేండ్లు, 8 సెమిస్టర్లు
పీజీ కోర్సులు..
ఎం. డిజైన్(ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్)
ఎం. డిజైన్ (ఫ్యాషనల్ డిజైన్)
ఎంబీఏ (రిటైల్ అండ్ ఫ్యాషన్ మర్చండైజ్)
పీజీ కోర్సుల కాల పరిమితి : రెండేండ్లు, నాలుగు సెమిస్టర్లు
అర్హతలు ఏంటి..?
యూజీ కోర్సులకు ఇంటర్, పీజీ కోర్సులకు డిగ్రీ పాసై ఉండాలి. డిగ్రీ కోర్సులకు 25 ఏండ్లు మించరాదు. పీజీ కోర్సులకు వయో పరిమితి లేదు.
ఎంపిక ఎలా..?
దేశ వ్యాప్తంగా నిర్వహించే ఆల్ ఇండియా సెలక్షన్ టెస్ట్(ఏఐఎస్‌టీ) 2025 ద్వారా ఎంపిక నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అనలిటికల్ ఎబిలిటీ, బిజినెస్ ఆప్టిట్యూడ్, డిజైన్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, కాంప్రహెన్షన్, గ్రామర్ వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.
ముఖ్యమైన తేదీలివే..
ఎఫ్‌డీడీఐ కోర్సులకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి.
చివరి తేదీ : ఏప్రిల్ 20
ప్రవేశ పరీక్ష తేదీ : మే 11
వెబ్‌సైట్ : www.fddiindia.com
మరి ప్లేస్‌మెంట్స్ ఎక్కడ లభిస్తాయి..?
బాటా, మ్యాక్స్, ఖాదీమ్స్, పూమా, లిబర్టీ, రిలయన్స్, పిడిలైట్, రీబాక్, అడిడాస్, స్కెచర్స్, స్నాప్‌డీల్, విశాల్, అప్పెరల్, లైఫ్‌స్టైల్, మిర్జా, వీకేసీ, టాటా ఇంటర్నేషనల్, యాక్షన్ వంటి ప్రముఖ సంస్థల్లో ప్లేస్‌మెంట్స్ లభిస్తాయి.