English Diploma | డిస్టెన్స్‌లో ‘ఇంగ్లిష్‌’ డిప్లొమా.. దరఖాస్తులకు ఆహ్వానం

English Diploma | ఈ రోజుల్లో కెరీర్‌లో ముందుకు వెళ్లాలంటే ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ ఎంతో అవసరం. ఉన్నత చదువులు చదివిన చాలామంది ఇంగ్లిష్‌లో సరిగా కమ్యూనికేట్‌ చేయలేక అందివచ్చిన అవకాశాలను చేజార్చుకుంటున్నారు. ఈ క్రమంలో 'ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ డిప్లొమా ప్రోగ్రామ్‌'లో ప్రవేశాల కోసం 'బెంగళూరులోని రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్ - సౌత్‌ ఇండియా' దరఖాస్తులు కోరుతోంది.

English Diploma | డిస్టెన్స్‌లో ‘ఇంగ్లిష్‌’ డిప్లొమా.. దరఖాస్తులకు ఆహ్వానం

English Diploma : ఈ రోజుల్లో కెరీర్‌లో ముందుకు వెళ్లాలంటే ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ ఎంతో అవసరం. ఉన్నత చదువులు చదివిన చాలామంది ఇంగ్లిష్‌లో సరిగా కమ్యూనికేట్‌ చేయలేక అందివచ్చిన అవకాశాలను చేజార్చుకుంటున్నారు. ఈ క్రమంలో ‘ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ డిప్లొమా ప్రోగ్రామ్‌’లో ప్రవేశాల కోసం ‘బెంగళూరులోని రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్ – సౌత్‌ ఇండియా’ దరఖాస్తులు కోరుతోంది.

డిస్టెన్స్‌ విధానంలో ఈ ‘డిప్లొమా ఇన్‌ ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ ప్రోగ్రామ్‌’ను ఆఫర్‌ చేయనున్నారు. ఈ కోర్సులో ప్రవేశాలు కోరగోరే వారు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ‘డైరెక్టర్‌, రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌, సౌత్‌ ఇండియా, జ్ఞానభారతి క్యాంపస్‌, బెంగళూరు’ చిరునామాకు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు కింద పేర్కొన్న వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

ముఖ్య విషయాలు..

కోర్సు వ్యవధి : ఏడాది
అర్హత : PUC లేదా 10+2 ఉత్తీర్ణులవ్వాలి
దరఖాస్తులకు చివరితేది : 2024 మే 31
వెబ్‌సైట్‌ : https://www.riesi.ac.in