MEGA 158 | కోల్‌కతా నేపథ్యంలో మెగా గ్యాంగ్‌స్టర్ డ్రామా
చిరు – బాబీ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం (Mega 158) షూటింగ్కు రెడీ అయింది. తాజాగా మేకర్స్ ఫైనల్ స్టోరీ డ్రాఫ్ట్ సిద్ధమైందని అధికారికంగా ప్రకటించారు. ఆ డ్రాఫ్ట్‌తో పాటు బెంగాలీ భాషలో ఉన్న ఒక ప్రత్యేక వ్యాక్యాన్ని జత చేయడంతో, కథ మొత్తం కోల్‌కతా నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామా అని స్పష్టమైంది.
Mega 158 Update: Chiru–Bobby Final Story Draft Locked, Kolkata Gangster Drama Confirmed
(విధాత వినోదం డెస్క్)
MEGA 158 | మెగాస్టార్ చిరంజీవి వరుసగా భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర వరప్రసాద్ గారు” షూటింగ్ శరవేగంగా పూర్తిచేస్తున్నారు. అదే సమయంలో, దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “విశ్వంభర” సమ్మర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రెండు ప్రాజెక్టుల తరువాత, నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మరో చిత్రం చేయడానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇవన్నీ పక్కన పెడితే, మెగాస్టార్ మళ్లీ దర్శకుడు బాబీ కొల్లితో చేతులు కలపడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఈ కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య సెన్సేషన్ బ్లాక్‌బస్టర్ కావడంతో, కొత్త సినిమా మీద అంచనాలు ఒక్కసారిగా పైకి దూసుకెళ్లాయి.
ఫైనల్ స్టోరీ డ్రాఫ్ట్ లాక్ – కోల్‌కతా బ్యాక్‌డ్రాప్ గ్యాంగ్‌స్టర్ డ్రామా
ఈ సరికొత్త ప్రాజెక్ట్‌ను కేవీఎన్ సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. తాజాగా మేకర్స్ ఫైనల్ స్టోరీ డ్రాఫ్ట్ సిద్ధమైందని అధికారికంగా ప్రకటించారు. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో చిరంజీవి చేసిన చూడాలని ఉంది సినిమా బ్లాక్‌బస్టర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అదే నగర నేపథ్యంలో బాబీ – చిరు కాంబో మళ్లీ వస్తుండటంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. పక్కా మాస్, కమర్షియల్ ట్రీట్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా భారీ బాక్సాఫీస్ రన్ సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఫోటోలో ఉన్న ఒక బెంగాలీ వ్యాక్యం যে রেড রঙকে মানদণ্ড স্থাপন করেছে (ఎరుపును కొలమానంగా నిర్ణయించింది ఎవరు?– Who established the standard for the red color?) చూస్తే ఇదో బ్లడ్ బాత్ సినిమాలానే ఉంది. అందుతున్న వివరాల ప్రకారం, ఈ చిత్రానికి లేటెస్ట్ ఓజీ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు. రెగ్యులర్ షూట్ అతి త్వరలోనే మొదలుకానుంది.
ALSO READ | నన్ను చాలా మంది చంపాలనుకున్నారు..నటి సంచలన వ్యాఖ్యలు
డీఓపీ మార్పే ఆలస్యానికి కారణం : కొత్త సినిమాటోగ్రాఫర్‌గా యంగ్ సెన్సేషన్

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా మొదటిగా యంగ్ డైరెక్టర్, ‘మిరాయ్’ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేనిని తీసుకున్నారు. మిరాయ్ హిట్‌తో ఆయనకు వచ్చిన క్రేజ్ కారణంగా ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి పడింది. అయితే అనూహ్య కారణాల వల్ల ఆయన ఈ సినిమా నుండి తప్పుకోవడంతో సెప్టెంబర్‌లో మొదలవ్వాల్సిన షూట్ ఆలస్యమైంది.
అయితే తాజా సమాచారం ప్రకారం, అతని స్థానంలో మేకర్స్ నిమిష్ రవిని డీఓపీగా ఫైనల్ చేశారు. ఇటీవలి సంచలన చిత్రం లోక – చాప్టర్1, కింగ్ ఆఫ్ కోటా, లక్కీ భాస్కర్, సూర్య 46 వంటి చిత్రాలకు ఆయన అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించిన విషయం తెలిసిందే. లోక వల్లే ఆయన మెగా 158 చాన్స్ అందుకున్నారు. ఇప్పుడు మెగాస్టార్ సినిమాకు ఆయన ఎంపిక కావడంతో, టెక్నికల్ టీమ్ పూర్తి అయింది. దీంతో షూటింగ్‌కు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కోల్‌కతా బ్యాక్‌డ్రాప్, గ్యాంగ్‌స్టర్ థీమ్, బాబీ – చిరంజీవి బ్లాక్‌బస్టర్ కాంబో, తమన్ మ్యూజిక్… ఇంకా చాలా వివరాలపై సస్పెన్స్ కొనసాగుతున్న దృష్ట్యా, ఈ అన్ని అంశాలు చూస్తే, ఈ సినిమా భారీ స్థాయిలో విజయం సాధించే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram