Allu Arjun | అల్లు అర్జున్ బ‌ర్త్ డే.. అర్ధ‌రాత్రి బ‌న్నీ ఇంటి ముందు అభిమానుల హంగామా

Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏప్రిల్ 8న తన 44వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో ఉన్న ఆయన నివాసం వద్ద అభిమానులు సంద్రంలా తరలివచ్చారు. తమ అభిమాన హీరోను ఒక్కసారి చూడాలనే ఆశతోనే కాకుండా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు.

  • By: Sandeep |    movies |    Published on : Apr 08, 2026 10:20 AM IST
Allu Arjun | అల్లు అర్జున్ బ‌ర్త్ డే.. అర్ధ‌రాత్రి బ‌న్నీ ఇంటి ముందు అభిమానుల హంగామా

Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏప్రిల్ 8న తన 44వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో ఉన్న ఆయన నివాసం వద్ద అభిమానులు సంద్రంలా తరలివచ్చారు. తమ అభిమాన హీరోను ఒక్కసారి చూడాలనే ఆశతోనే కాకుండా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు.

ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా అభిమానులను నిరాశపరచకుండా అల్లు అర్జున్ అర్ధరాత్రి తర్వాత ఇంటి బయటకు వచ్చి వారికి అభివాదం చేశారు. ఆయనను చూసిన అభిమానులు ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. కొందరు బహుమతులు తీసుకురాగా, మరికొందరు ఆ క్షణాలను తమ ఫోన్లలో చిత్రీకరించారు.

సంప్రదాయంగా కొనసాగుతున్న అభిమానుల కలయిక

మెగా, అల్లు కుటుంబాల్లో ప్రత్యేక సందర్భాల్లో అభిమానులను ప్రత్యక్షంగా కలవడం ఓ సంప్రదాయంగా మారింది. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అల్లు అర్జున్ తన పుట్టినరోజున అభిమానులను కలుసుకుని వారికి కృతజ్ఞతలు తెలిపారు.

వీధంతా అభిమానులతో కిక్కిరిసిన వాతావరణం

అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో ఆయన నివాసం చుట్టూ ఉన్న వీధులు కిక్కిరిసిపోయాయి. ఆయన ఇంటి కంచె దగ్గర నిలబడి అభిమానులకు అభివాదం చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్ ప్ర‌స్తుతం కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తోన్న సైంటిఫిక్ మాస్ ఎంటర్టైనర్ చిత్రంలో న‌టిస్తున్నాడు. అల్లు అర్జున్ కు ఇది 22వ మూవీ. అలాగే- అట్లీకి ఇది ఆరో సినిమా. దీని వర్కింగ్ టైటిల్.. ‘AA22 x A6’. 800 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్.. ఈ సినిమాను నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ డీటైల్స్ మ‌రి కొద్ది గంట‌ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.